అల్లు అర్జున్ పుష్ప విలన్లలో ఒకరిగా నటించిన జాల్ రెడ్డి గుర్తున్నాడుగా. శ్రీవల్లిని కవ్వించి తనదగ్గరకు ఒంటరిగా రమ్మని చెప్పి బన్నీ చేతిలో చావు దెబ్బలు తిని మంచాన పడే పాత్రలో ధనుంజయ్ నటన బాగా పేలింది. శాండల్ వుడ్ లో తనకు సోలో హీరోగా మంచి మార్కెట్ ఉంది. గత ఏడాది బడవ రాస్కెల్ అనే హిట్ మూవీని తెలుగులో డబ్ చేశారు కానీ సరైన మార్కెటింగ్ లేకపోవడంతో మన జనానికి రీచ్ కాలేదు.
ఫ్యాన్స్ ఇతన్ని డాలీ అని పిలుచుకుంటారు. ఇతని కొత్త చిత్రం గురుదేవ్ హొయ్ సల నిన్న నాని దసరాతో కర్ణాటకతో పాటు కొన్ని తెలుగు కేంద్రాల్లోనూ రిలీజ్ అయ్యింది. రివ్యూలు పబ్లిక్ టాక్ పాజిటివ్ గా ఉన్నాయి. రెగ్యులర్ ఖాకీ చొక్కా బ్యాక్ డ్రాప్ అయినా కథలో వైవిధ్యాన్ని జొప్పించారు. భయమే లేని పోలీస్ ఆఫీసర్ గురుదేవ్(ధనుంజయ్). ఎన్ని ట్రాన్స్ఫర్లు వచ్చినా లెక్క చేయడు. అనాథలంటూ తన దగ్గరికొచ్చిన ఓ ప్రేమజంటకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు. తీరా చూస్తే అమ్మాయి పెద్ద పలుకుబడి ఉన్న స్థానిక నాయకుడి కూతురు.
తక్కువ కులానికి చెందిన కుర్రాడు మోసం చేయడం వల్ల ఇదంతా జరిగిందని తెలుసుకున్న గురుదేవ్ వేట మొదలుపెడతాడు. మరోవైపు విలన్ గ్యాంగ్ మొత్తం పెళ్లి చేసుకున్న ఆ జోడిని చంపేందుకు రంగంలోకి దిగుతారు. ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు విజయ్ తెరకెక్కించిన తీరు గురుదేవ్ హొయ్ సలని నిలబెట్టింది.
ధనుంజయ్ పెర్ఫార్మన్స్ ప్రధాన బలం. దళపతి, కార్తీ ఖైదీ, సైరాత్ తదితర సినిమాల్లోని కీ ఎపిసోడ్స్ ని తెలివిగా వాడుకోవడం ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ కొంత నెమ్మదించినా ఫైనల్ గా మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. కబ్జా దారుణమైన డిజాస్టర్ తర్వాత శాండల్ వుడ్ కి కొంత ఊరట కలిగించేలా ఈ గురుదేవ్ హొయ్ సల ఉందని ట్రేడ్ రిలీఫ్ ఫీలవుతోంది. వసూళ్లు బాగున్నాయి. కమర్షియల్ స్కేల్ కనక పెద్దగా వెళ్తే అనువాదమో రీమేకో జరిగే అవకాశం లేకపోలేదు
This post was last modified on March 31, 2023 1:21 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…