నాని ముందు నుంచి చెప్పినట్టే దసరా అంచనాలకు మించి మొదటి రోజు అదరగొట్టేసింది. న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే అతి పెద్ద నెంబర్లు నమోదు చేసింది. గురువారం విడుదల కావడంతో మొత్తం నాలుగు రోజుల వీకెండ్ ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకోబోతోంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఫస్ట్ డే షేర్ 20 కోట్లకు పైగానే ఉందట.
తెలుగు రాష్ట్రాలను మాత్రమే తీసుకుంటే 14 కోట్లకు పైగానే రాబట్టడం చిన్న విషయం కాదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన లైగర్ సెట్ చేసిన మార్క్ ని పెద్ద మార్జిన్ తో నాని దాటేశాడు
ఇవాళ్టి అడ్వాన్స్ బుకింగ్స్ నలభై శాతానికి పైగానే ముందస్తుగా అమ్ముడుపోగా మిగిలినవి కౌంటర్ దగ్గర హౌస్ ఫుల్ అయిపోతాయని అంటున్నారు. ట్రెండ్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ పెట్టుకున్న యాభై కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది.
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా అనుభవం ఉన్నవాడిలా సబ్జెక్టుని డీల్ చేసిన తీరు ముఖ్యంగా మాస్ ని ఆకట్టుకుంటోంది. గొప్ప క్లాసిక్ అనో లేదా నాని పోల్చినట్టు ఆర్ఆర్ఆర్ లేదా కాంతారా కెజిఎఫ్ స్థాయని చెప్పలేం కానీ ఇప్పుడున్న బాక్సాఫీస్ పరిస్థితికి దసరా ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదన్నది నిజం. వచ్చే వారం మీటర్, రావణాసురలు ఉన్నాయి కాబట్టి వాటి టాక్ ని బట్టి దసరా దూకుడు ఎన్ని వారాలు స్ట్రాంగ్ గా ఉంటుందనేది అంచనా వేయొచ్చు.
ఆ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడున్న రెస్పాన్స్ ని స్థిరంగా కొనసాగించగలిగితే నాని ఫైనల్ ఫిగర్స్ ఖచ్చితంగా షాకింగ్ గా ఉంటాయి. నాని టైర్ 1 లీగ్ లోకి వచ్చేశాడని అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. అంటే సుందరానికి మొదటి రోజు నాలుగు కోట్లకే తెగ కష్టపడింది. కానీ దసరా తేలికగా నాలుగింతల ఎక్కువ మార్జిన్ తో దూసుకుపోవడం చూస్తుంటే నాని ఊచకోత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 31, 2023 10:53 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…