వ్య‌వ‌స్థ‌లు విఫ‌లం.. విజ‌న్ లేని వైసీపీ!!

ఏపీలో భారీ అంచ‌నాల‌తో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. ప‌ట్టుమ‌ని నాలుగేళ్లు గ‌డిచేసరికే .. విఫ‌ల‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎక్క‌డా కూడా.. ఏ ఒక్క సామాజిక వ‌ర్గం కానీ.. ఏ వ్య‌క్తిగానీ..జ‌గ‌న్‌కు అనుకూలంగా లేర‌నే వాద‌న సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తోంది. దీంతో నాలుగేళ్లుగా వైసీపీ చేసిన పాల‌న‌.. త‌ద్వారా.. ఏం చేశార‌నే ప్ర‌శ్న‌లు ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

నిజానికి వైసీపీ వ‌చ్చిన త‌ర్వాత‌.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీస‌కువ‌చ్చింది. త‌ర్వాత‌.. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తెచ్చింది. ఇవ‌న్నీ చాల‌ద‌న్న‌ట్టుగా ఇటీవ‌ల‌.. గృహ సార‌థులు కాన్సెప్టును తీసుకువ‌చ్చారు. అయితే.. ఈ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కూడా.. అనుకున్న‌ది సాధించ‌లేక‌పోతున్నాయి. ముఖ్యంగా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ కార‌ణంగా.. ఎమ్మెల్యేల‌కు.. ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఉన్న సున్నిత‌మైన రాజ‌కీయ బంధం బెడిసికొట్టింద‌ని సొంత పార్టీ నాయ‌కులే చెబుతున్నారు.

ఇక‌, గృహ‌సార‌థుల‌కు ఆదిలోనే అనేక ఇబ్బందులు వ‌చ్చాయి. దీంతో అస‌లు ఈ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా మరిచిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందుగానే ప్ర‌తిపక్షం మాదిరిగా.. అధికార ప‌క్షంలో ఉన్న ఎమ్మెల్యేల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ఇంటింటికీ తిప్పారు. పోనీ.. ఇలా తిరుగుతున్న క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్ల‌ను కానీ,, వారు చెబుతున్న స‌మ‌స్య‌ల‌ను కానీ ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

మ‌రి అలాంట‌ప్పుడు.. ఎమ్మెల్యేలుమాత్రం ఎందుకు తిరగాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతుంది. ఇక మ‌రోవైపు స‌ర్వేల పేరుతో ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని.. మొహం మీదే చెప్పేశారు. ఇది పార్టీలోనూ.. త‌మ వ‌ర్గంలోనూ.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ కూడా ఎమ్మెల్యేల‌ను డైల్యూట్ చేసింది. చివ‌ర‌కు ఇలాంటివారు పార్టీకి వ్య‌తిరేకంగా మారిపోయారు. అభివృద్ధి ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న సొంత పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా శ‌త్రువులుగా ను.. టీడీపీతో లాలూచీప‌డ్డ వారిగానూ చూశారు. ఫ‌లితంగా జ‌గ‌న్ అన్నివిష‌యాల్లోనూ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నేది వాస్త‌వం.