సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టింది సమంత. చెన్నై, ముంబై లో ప్రమోషనల్ ఇంటర్యూలు ఇస్తూ శాకుంతలం గురించి, తన లైఫ్ గురించి చెప్పుకుంటుంది. అయితే సమంత కొన్నాళ్లుగా తెలుగు మీడియాకి దూరంగా ఉంటుంది.
యశోద టైంలో కూడా తెలుగు మీడియా ముందుకు రాలేదు సమంత. ఆ టైమ్ లో సుమ తో ఒక కామన్ ఇంటర్వ్యూ మాత్రమే చేసింది. అయితే అప్పుడు సామ్ అనారోగ్యంతో ఉందని మీడియా లైట్ తీసుకుంది. కానీ తాజాగా శాకుంతలం విషయంలోనూ సమంత తెలుగు మీడియాకి దూరంగా ఉంటుంది.
ఇటీవలే రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ కి కూడా సామ్ హాజరులేదు. అక్కడ మీడియా నుండి ఎదురయ్యే క్వశ్చన్స్ ఫేస్ చేయలేకే అటెండ్ అవ్వలేదనే డిస్కషన్ నడుస్తుంది. టీజర్ లాంచ్ కి హాజరైంది కానీ అప్పుడు తెలుగు మీడియా కి నో క్వశ్చన్ అంటూ టీమ్ ముందే చెప్పేశారు.
ఏదేమైనా తెలుగు మీడియాకి సమంత కాస్త దూరంగానే ఉంటుంది. బహుశా చైతు గురించి, తన హెల్త్ గురించి క్వశ్చన్స్ ఎదురవుతాయని సామ్ ఊహించి అందుకే కాస్త దూరంగా ఉంటుంది కాబోలు. కానీ రిలీజ్ దగ్గర్లో మాత్రం తెలుగు మీడియాను సామ్ ఫేస్ చేయాల్సిందే. సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిందే.
This post was last modified on March 30, 2023 8:29 am
ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన…
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. లిబరల్ పార్టీకి…
మంగళవారం తెల్లవారుజామున నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో తీవ్ర భూకంపం సంభవించి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత…
కోలీవుడ్ హీరో సూర్య కొండంత ఆశలతో రెండేళ్లకు పైగా విలువైన సమయాన్ని కేటాయించి చేసిన ప్యాన్ ఇండియా మూవీ కంగువ…
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎక్కువగా విలన్ వేషాలతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ కరోనా టైంలో తనలోని హ్యూమన్…