కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో రెండు బ్లాక్ బస్టర్లు ధమాకా, వాల్తేరు వీరయ్య అందుకున్న జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా రావణాసుర వచ్చే నెల 7న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఇంకో పది రోజులే సమయం ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచారు. దీంతో హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తుండగా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని దర్శకుడు సుధీర్ వర్మ ఊరిస్తూ వచ్చాడు.
క్రైమ్ నేపథ్యంలో రూపొందిన రావణాసుర ఇవాళ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరదాగా ఉండే ఓ క్రిమినల్ లాయర్(రవితేజ) కేసుల కోసం తిప్పలు పడుతూ తనకన్నా సీనియరైన లేడీ వకీల్ (ఫరియా అబ్దుల్లా) చుట్టూ తిరుగుతూ నానా తిప్పలు పడతాడు. ఓ అందమైన అమ్మాయి(అను ఇమ్మానియేల్) తరఫున వాదించేందుకు కంకణం పుచ్చుకుంటాడు.
ఇతని జీవితంలో మరో యువతి(మేఘ ఆకాష్), ఇంకో ఆగంతకుడు(సుశాంత్) ఉంటారు. ఇలా కూల్ గా సాగుతున్న జీవితంలో కొన్ని హత్యలు అతని జీవితాన్ని మార్చేస్తాయి. హంతకుల వెంట పడటమే కాదు స్వయంగా మర్డర్లు చేయాల్సి వస్తుంది. ఇంతకీ రావణాసురలోని రెండో షేడ్ ఏంటనేదే అసలు కథ. కామెడీతో మొదలుపెట్టి సీరియస్ వైపు మలుపు తిప్పి కంప్లీట్ గా క్రైమ్ ఎంటర్ టైనర్ ఇచ్చిన ఫీలింగ్ కలిగించాడు దర్శకుడు సుధీర్ వర్మ.
రవితేజ చేసే రెగ్యులర్ క్యారెక్టర్స్ తరహాలో కాకుండా నెగటివ్ టచ్ ని జోడించి చేసిన ప్రయోగం వెరైటీగా ఉంది. సుశాంత్ పాత్రను ఎక్కువ రివీల్ చేయలేదు. జయరాం, మురళీశర్మ ఇలా సీనియర్ క్యాస్టింగ్ చాలానే ఉంది. హర్షవర్ధన్ – భీమ్స్ సిసిరోలియో జంటగా సంగీతం అందించగా విజయ్ కార్తిక్ ఛాయాగ్రహణం సమకూర్చారు. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ ఉంది. డిఫరెంట్ హీరోయిజంతో వస్తున్న మాస్ రాజా ఎలా మెప్పించబోతున్నాడో ఏప్రిల్ 7న తేలిపోతుంది
This post was last modified on March 28, 2023 4:58 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…