దసరా పై బోయపాటి కర్చీఫ్

దసరా పై బోయపాటి కర్చీఫ్వచ్చే ఏడాది సంక్రాంతి కి ఇప్పటికే రెండు భారీ సినిమాలు కర్చీఫ్ వేసేసుకున్నాయి. ఇక మిగిలిన దసరా సీజన్ పై కూడా కన్నేస్తున్నారు స్టార్ దర్శకులు. తాజాగా బోయపాటి రామ్ కాంబో సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20 రిలీజ్ అంటూ ప్రకటించారు.

అఖండ తర్వాత బోయపాటి నుండి రాబోతున్న ఈ మాస్ యాక్షన్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే యాభై శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.

పూరితో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కి మాస్ లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆశించిన మాస్ హిట్ అందుకోలేక పోయాడు రామ్. ఈసారి బోయపాటి తనకి పోటీ లెవెల్ మాస్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్మకంతో ఉన్నాడు.

రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. బోయపాటి స్టైల్ యాక్షన్ ఇందులో భారీ గా ఉండబోతుంది. అందుకే దసరా సీజన్ కి సినిమా రిలీజ్ ను లాక్ చేశారు.