రాజమౌళి RRRను ఆస్కార్ వరకూ తీసుకెళ్లడం కోసం యాబై కోట్లు ఖర్చు పెట్టారని , లేదు లేదు అంతకంటే ఎక్కువే అంటూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆస్కార్ రేస్ లో “నాటు నాటు” ఉన్నప్పటి నుంచే ఈ బడ్జెట్ పై ఇండస్ట్రీలో రకరకాల గాసిప్స్ వినిపించాయి. అయితే ఆస్కార్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు పెట్టేస్తున్నాడని అంత అవసరం లేదని కొందరు ప్రముఖులు కూడా కామెంట్ చేశారు.
కానీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి పెట్టిన అసలు ఖర్చు విని ఇప్పుడు అలా కామెంట్ చేసిన అందరూ షాక్ అవుతున్నారు. RRR ఆస్కార్ కోసం జక్కన్న ఖర్చు పెట్టింది కేవలం 8 కోట్ల 50 లక్షలు మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి కొడుకు కార్తికేయనే చెప్పాడు. ఇటీవలే ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయ ఆస్కార్ కోసం మూడు విడతలుగా రెండున్న నుండి మూడు కోట్లు ఖర్చు చేశామని అన్నాడు.
కార్తికేయ చెప్పిన ఈ బడ్జెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి తన తెలివితేటలతో హాలీవుడ్ లో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రమోట్ చేసుకున్నాడు అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నాడు. ఏదేమైనా రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ వెనుక ఉన్న కార్తికేయ అసలు బడ్జెట్ చెప్పడంతో ఇప్పుటి వరకూ చక్కర్లు కొట్టిన అన్ని రూమర్స్ కి ఫులి స్టాప్ పడినట్టయింది.
This post was last modified on March 27, 2023 9:30 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…