ఇంకో మూడే రోజుల్లో దసరా థియేటర్లలో వచ్చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద సరైన మాస్ బొమ్మ వచ్చి చాలా కాలమవుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. ప్రత్యేకంగా నార్త్ ఇండియా వెళ్లి నగరాలు సందర్శించి, అక్కడి జనాలను పలకరించి, రోడ్ షోలు చేసి, ఫేమస్ ఫుడ్ పాయింట్ల వద్ద ఛాట్లు గట్రా తిని తనవంతుగా శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు.
హైదరాబాద్ వచ్చాక అడిగినవారికి నో అనకుండా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయింది. అంతా బాగానే కనిపిస్తోంది కానీ హిందీ వెర్షన్ విషయంలో నిర్మాతలు కాసింత అశ్రద్ధ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ముంబై, ఢిల్లీ, పూణే, కోల్కతా ఇలా ఏ ప్రధాన నగరంలో చూసినా టికెట్లు అందుబాటులో ఉంచలేదు.
అదే రోజు పోటీగా వస్తున్న అజయ్ దేవగన్ భోళా (ఖైదీ రీమేక్) సేల్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. నార్త్ సైడ్ దసరాకు ఇది ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. పైగా అది త్రీడిలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్. దాన్ని తట్టుకోవాలంటే దసరాని ఓ రేంజ్ లో అక్కడి ఆడియన్స్ కి రీచ్ చేయాలి. ముందే బుక్ చేసుకోవాలన్న ఆసక్తి పెంచాలి.
వీటిలో ఒక బాధ్యత పూర్తయ్యింది కానీ రెండోది ఇంకా నెరవేరాలి. వీలైనంత త్వరగా బుకింగ్స్ పెట్టేలా చేయాలి. హక్కులను అమ్మగానే సరిపోదు. దానికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయాలి. నానికి ఇదంతా తెలుసో లేదోనని ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. భోళాని ఫేస్ చేయడం అంత సులభం కాదు. పైగా దాన్ని సపోర్ట్ చేయడం కోసం ముంబై మీడియా దసరాని తక్కువ చేసినా ఆశ్చర్యం లేదు. మొదటి ప్యాన్ ఇండియా ప్రయత్నంగా నాని దీని మీద పెట్టుకున్న ఆశలు అన్నిఇన్ని కావు. క్లిక్ అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలకు అమాంతం బిజినెస్ పెరుగుతుంది
This post was last modified on March 28, 2023 7:23 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…