పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేనంత ఊపు చూపిస్తున్నారిప్పుడు. సినిమాల మీద ఆసక్తి లేదన్నట్లు కనిపిస్తూనే.. 2024 ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేలోపు తాను ఇచ్చిన అన్ని కమిట్మెంట్లనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. గత నెలలోనే మొదలైన ‘వినోదియ సిత్తం’ రీమేక్‌కు సంబంధించి అప్పుడే తన పని పూర్తి చేసేశాడు పవన్.
ఈ సినిమా కోసం మూడు వారాల డేట్లు కేటాయించి.. విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొన్న పవన్.. తన వరకు టాకీ పార్ట్ అంతా అవగొట్టేశాడు. మరి కొన్ని రోజుల్లోనే హరీష్ శంకర్ సినిమా కూడా మొదలు కాబోతోంది. ఆ సినిమా కోసం సెట్టింగ్ నిర్మాణం పూర్తయింది. షెడ్యూల్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగుతోంది చిత్ర బృందం.
మరోవైపు యువ దర్శకుడు సుజీత్‌తో పవన్ చేయనున్న సినిమాకు షూట్ మొదలుపెట్టేందుకు కూడా రంగం సిద్ధమవుతుండటం విశేషం. పవన్ చేస్తున్న, చేయబోయే సినిమాలన్నింట్లో మంచి క్రేజ్ ఉన్న చిత్రమిది. ఈ చిత్రానికి ‘ఓజీ‘ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లొకేషన్ల వేట సాగిస్తోంది సుజీత్ టీం.
ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్. దర్శకుడు సుజీత్, సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ కలిసి లొకేషన్లను పరిశీలిస్తున్న దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. లొకేషన్లు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ నెలాఖర్లో సెట్స్ మీదికి వెళ్లొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఐదారు నెలల్లో పవన్ ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
This post was last modified on March 27, 2023 6:32 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…