చిరంజీవి, పవన్ కళ్యాణ్ అటు షిఫ్ట్ అయిపోయారు!

మెగా బ్రదర్స్ ఇద్దరూ కరోనా విజృంభిస్తున్న టైములో నో షూటింగ్ అంటూ ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి గడ్డం, మీసాలు తీసేసి యంగ్ గా కనిపిస్తూ వుంటే, పవన్ గడ్డం, మీసాలు పెంచేసి మళ్ళీ ఎన్నికల అనంతరం లుక్ కి మారిపోయాడు. ఇదిలా వుంటే, ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ కి ససేమీరా అని మెగా బ్రదర్స్ ఇద్దరూ తేల్చేయడంతో… సంక్రాంతికి వస్తుందని భావిస్తున్న వకీల్ సాబ్ ఇక అప్పుడు రాదని తేలిపోయింది.

తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత తాపీగా అన్నీ చేసుకుని వచ్చే వేసవిలో విడుదల చేయవచ్చని పవన్ డిసైడ్ అయ్యాడు. అలాగే చిరంజీవి కూడా ఆచార్య సినిమా వచ్చే వేసవి చివర్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పటికి కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి, వాక్సిన్ కూడా వచ్చేస్తుందని, మళ్ళీ జనం మాములుగా సినిమాలకు వస్తారని భావిస్తున్నారు. అందుకే పెద్ద సినిమాలకు 2021 వేసవి బెస్ట్ టైం అని ట్రేడ్ లో కూడా చెప్పుకుంటున్నారు.