నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో బి గోపాల్ పేరు మొదటిదైతే బోయపాటి శీను రెండో మనిషి. సింహాతో మొదలైన ఈ సూపర్ హిట్ కాంబో ఆ తర్వాత లెజెండ్ తో ఏకంగా బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టింది. వరస డిజాస్టర్లతో బాలయ్య సతమతమవుతున్న టైంలో అఖండ రూపంలో అదిరిపోయే విజయాన్ని అందించింది బోయపాటినే. అందుకే వీళ్లిద్దరూ మళ్ళీ కలుస్తున్నారంటే అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఇద్దరూ ప్రస్తుతం వేర్వేరు కమిట్ మెంట్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అఖండ 2కి స్క్రిప్ట్ సిద్ధమవుతుందని ప్రస్తుతం రామ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తవ్వగానే బోయపాటి శీను దాన్నో కొలిక్కి తెస్తారని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు దానికి సీక్వెల్ బదులుగా వేరే పవర్ ఫుల్ సబ్జెక్టుతో బోయపాటి ఇటీవలే బాలయ్యకో లైన్ చూచాయగా చెప్పారట. అది నచ్చడంతో ఫుల్ వెర్షన్ సిద్ధం చేయించే పనులు జరుగుతున్నట్టు వినికిడి. అంతా సవ్యంగా జరిగితే జూన్ రెండో వారంలోనే కొబ్బరికాయ కొట్టేసి చిత్రీకరణ మొదలుపెట్టొచ్చని టాక్. ఆలోగా అనిల్ రావిపూడి చిత్రం పూర్తయిపోతుంది.
మరి కొత్త కథ తీసుకుంటారా లేక బోయపాటి రాసుకున్న పాయింట్ ని జోడించి దాన్ని అఖండ 2గా తీస్తారానేది ప్రస్తుతానికి సస్పెన్స్. వరుస విజయాలతో పాటు అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఊపుమీదున్న బాలయ్య వీరసింహారెడ్డితో తన కెరీర్ బెస్ట్ అని అందుకున్న సంగతి తెలిసిందే. రావిపూడి సినిమా తాలూకు ఫస్ట్ లుక్ చూశాక దాని మీదా పాజిటివ్ వైబ్స్ మొదలైపోయాయి. సో పక్కా ప్లానింగ్ తో ఎక్కడా బ్రేకులు రాకుండా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఆదిత్య 999 అన్నారు కానీ దాంతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఇంకొంత ఆలస్యం అయ్యేలా ఉంది.
This post was last modified on March 26, 2023 10:28 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…