సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెమ్మదిగా అందరూ నమ్మేస్తున్న టైంలో అతని ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే అతడిని మానసికంగా హింసించి, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారని అతడి తండ్రి కేసు పెట్టడం, ఎఫ్.ఐ.ఆర్.లో ఎన్నో తీవ్ర ఆరోపణలు చేయడంతో మళ్ళీ ఈ కేస్ హాట్ టాపిక్ గా మారింది.
సుశాంత్ చనిపోయిన నెల రోజుల తర్వాత అతనిపై ప్రేమంతా సోషల్ మీడియాలో ఒలకబోసిన రియా… ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని హోమ్ మినిష్టర్ కి ట్వీట్ పెట్టింది. పది రోజులు తిరిగే సరికి ఆమె మీదే కేస్ బుక్ అయింది. దీంతో తన తరఫున వాదించడానికి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కేసులు వాదించిన వకీలుని పెట్టుకుంది.
అత్యంత ఖరీదైన ఆ లాయర్ ని భరించే ఆర్ధిక స్తోమత ఒక స్ట్రగులింగ్ హీరోయిన్ అయిన రియాకు ఎక్కడిదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ ఖాతా నుంచి ఆమె పదిహేను కోట్ల రూపాయల వరకు తన అకౌంట్ లోకి బదిలీ చేసుకుందని ఆమె తండ్రి ఆరోపణ. ఆ డబ్బు ఇలా వాడుతోందా? లేక తన వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉందా?
This post was last modified on July 30, 2020 12:25 am
ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…
తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…
ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…
గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే…