కన్నడ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన చిత్రం ‘కేజీఎఫ్’. ఒక కన్నడ సినిమా కర్ణాటక దాటి వేరే ప్రాంతాల్లో రిలీజవ్వడమే గగనం అంటే.. ఈ చిత్రం వేరే నాలుగు భాషల్లో రిలీజై అన్ని చోట్లా సంచలన వసూళ్లు రాబట్టింది. కన్నడలో అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ హిట్ కంటే నాలుగైదు రెట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక కన్నడ సినిమా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడమంటే చిన్న విషయం కాదు. కర్ణాటక బార్డర్ దాటి చాలా చోట్ల ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ పెద్ద విజయం సాధించింది. దీంతో ‘కేజీఎఫ్ ఛాప్టర్-2’ మీద అంచనాలు మామూలుగా లేవు. ‘బాహుబలి-2’ స్థాయిలో కాకపోయినా.. దీనికీ హైప్ భారీగానే ఉంది. అందుకు తగ్గట్లే సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి విలన్ పాత్ర ఫస్ట్ లుక్‌ను పరిచయం చేశారు. ‘ఛాప్టర్-1’ ముఖం చూపించకుండా పరిచయం చేసిన అధీర పాత్రలో సంజయ్ దత్ ఫెరోషియస్ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఐతే ఈ లుక్ చూడగానే అందరికీ హాలీవుడ్ సినిమాల్లో ‘వైకింగ్స్’ లుక్స్ గుర్తుకొచ్చాయి. ‘అపోకలిప్టో’ సహా పలు సినిమాల్లో ఇలాంటి లుక్స్‌తో పాత్రలను గమనించవచ్చు. ఐతే ఇలా లుక్ రిలీజ్ చేశాక.. కచ్చితంగా కాపీ కాపీ అంటూ ఆరోపణలు వస్తాయన్న సంగతి ముందే ఊహించిన చిత్ర బృందం… సంజయ్ లుక్‌కు వైకింగ్సే స్ఫూర్తి అని ముందే చెప్పేసింది. 8వ శతాబ్దంలో నార్వే, స్వీడన్ ప్రాంతాలల్లో సంచరించిన ఓ భయంకరమైన తెగకు చెందిన వాళ్లను వైకింగ్స్ అంటారు. ఈ వైకింగ్స్ మీద హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వారి స్ఫూర్తితోనే అధీర పాత్రను అత్యంత క్రూరంగా డిజైన్ చేసినట్లున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్-2’ను దసరాకే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. పరిస్థితి చూస్తే అందుకు అవకాశం లేనట్లే ఉంది.
This post was last modified on July 29, 2020 10:33 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…