Movie News

అదే కథతో సినిమా చేయడానికి పిచ్చోడినా-విశ్వక్


కొన్ని నెలల కిందట స్వల్ప వ్యవధిలో ‘ధమాకా’, ‘ధమ్కీ’ సినిమాల ట్రైలర్లు రిలీజయ్యాయి. అవి చూస్తే రెండు సినిమాలకు చాలా పోలికలు కనిపించాయి. ఈ రెండు చిత్రాలకూ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడనే కావడం విశేషం. మరి ఒకే రచయిత రెండు సినిమాలకు ఒకే రకమైన కథ ఇవ్వడమేంటి అనే చర్చ నడిచింది.

ఈ రెండు సినిమాల్లో ముందుగా ‘ధమాకా’ రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. ‘ధమ్కీ’ సినిమా రముందు అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు. కథలో పోలికల వల్ల తర్వాత మార్పులు చేర్పులు చేసి.. రీషూట్లు జరిపి నెల ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలపై ‘ధమ్కీ’ హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్సేన్ స్పందించాడు.

ఒక రచయిత రెండు సినిమాలకు ఎక్కడైనా ఒకే కథ ఇస్తాడా అని విశ్వక్ ప్రశ్నించాడు. వేరే సినిమా కథతో పోలిక ఉన్న స్టోరీని తీసుకుని సినిమా చేయడానికి నేనేమైనా పిచ్చోడినా అని విశ్వక్ అన్నాడు. రెండు సినిమాలకు ఒకే కథ ఇచ్చి ప్రసన్న కుమార్ ఇండస్ట్రీలో తిరగగలడా అని విశ్వక్ ప్రశ్నించాడు. ‘ధమాకా’ సినిమాకు ‘ధమ్కీ’కి ఏ పోలికా లేదని.. ‘ధమ్కీ’లో తాను ద్విపాత్రాభినయం చేశానని విశ్వక్ తెలిపాడు. తన సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి కారణం.. రీషూట్లు కాదని, అలాంటివేమీ జరగలేదని అతను స్పష్టం చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ వల్లే రిలీజ్ లేటైందని అతను తెలిపాడు.

ఈ కథతో తాను బాగా కనెక్ట్ కావడం వల్లే స్వయంగా డైరెక్ట్ చేసినట్లు వెల్లడించాడు. తాను డైరెక్ట్ చేయాలనుకునే వేరే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మొదట ఉంటాడని.. ఆ తర్వాత బాలయ్యను సైతం డైరెక్ట్ చేయాలని ఉందని విశ్వక్ తెలిపాడు. అర్జున్‌తో వివాదం గురించి స్పందిస్తూ.. తన గురించి ఆయన ప్రెస్ మీట్ విషయంలో ఇప్పటికీ తనకు క్వశ్చన్ మార్క్ ఉందని వ్యాఖ్యానించాడు.

This post was last modified on March 21, 2023 3:59 pm

Share

Recent Posts

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

11 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

21 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

43 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

1 hour ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago