కొన్ని సినిమాలు మేకింగ్ దశలో ఉండగానే కొంచెం తేడాగా అనిపిస్తాయి. ప్రోమోలు రిలీజయ్యాక అవి ఆడటం కష్టమే అన్న క్లారిటీ వచ్చేస్తుంది. గత ఏడాది ఆమిర్ ఖాన్ నుంచి వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’ విషయంలో జనాలకు ఇలాంటి ఫీలింగే కలిగింది. కొవిడ్ తర్వాత హిందీ సినిమాల పరిస్థితి చాలా సున్నితంగా తయారై, ప్రేక్షకుల అభిరుచి కూడా మారిన సమయంలో ‘లాల్ సింగ్ చడ్డా’ లాంటి చిత్రం వర్కవుటయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపించాయి. ఈ సినిమా ట్రైలర్ చూడగానే డిజాస్టర్ ఫీల్స్ వచ్చాయి. ఈ సినిమా బోల్తా కొట్టబోతోందని ముందే దాదాపుగా అందరూ ఫిక్సయిపోయారు. రిలీజ్ తర్వాత ఆ అంచనాలే నిజమయ్యాయి.
ఇప్పుడిక సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అతడి కొత్త సినిమా ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’కు సంబంధించి ఏ ప్రోమో చూసినా తేడాగానే అనిపిస్తోంది.
బాలీవుడ్‌కు రీమేక్‌లు అసలే కలిసి రావడం లేదు. పైగా’కిసి కా భాయ్ కిసి కి జాన్’ ఏమో.. ‘వీరం’ లాంటి రొటీన్ మూవీకి రీమేక్. ఈ చిత్రం తెలుగులో ‘కాటమ రాయుడు’ పేరుతో రీమేక్ అయి డిజాస్టర్ అయింది. ఇలాంటి రొటీన్ మాస్ సినిమాను ఇప్పుడు సల్మాన్ రీమేక్ చేస్తున్నాడు.
ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ మధ్యే సినిమా నుంచి ఒకదాని తర్వాత ఒకటి పాటలు రిలీజ్ చేశారు. అవి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలో సల్మాన్ లుక్కే చాలా తేడాగా అనిపిస్తోంది. పాటల్లో ఆయన హావభావాలు.. స్టెప్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఫ్యాన్స్ సంగతి ఏమో కానీ.. సామాన్య ప్రేక్షకుల్లో మాత్రం సినిమా పట్ల ఏమాత్రం ఆసక్తి కలగట్లేదు. ఫర్హాద్ సామ్‌జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న ఫ్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 21, 2023 3:54 pm
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…