పండుగలకు అభిమానులను సంతోష పెట్టేందుకు స్టార్ హీరోలు తమ సినిమా అప్డేట్స్ ఇవ్వడం ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ చేయడం సహజమే. అందులోకి తెలుగు నామ సంవత్సరం అంటే మన వాళ్ళకి మరీ సెంటిమెంట్. అందుకే ఈ ఉగాదికి బాలయ్య తన అప్ కమింగ్ మూవీ ఫస్ట్ లుక్ ప్లాన్ చేసుకుంటున్నారు.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. బ్రో ఐ డోంట్ కేర్ టైటిల్ తో బాలయ్య చైర్ లో కూర్చున్న ఓ పవర్ ఫుల్ స్టిల్ తో అనిల్ రావిపూడి ఫస్ట్ లుక్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపై వర్కింగ్ టైటిల్ తో కాకుండా టైటిల్ తో ప్రమోషన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఉగాది కి టైటిల్ , లుక్ రిలీజ్ చేసి బాలయ్య ఫ్యాన్స్ కి పండుగ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట.
బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ఓ ఇంపార్టెంట్ కేరెక్టర్ ప్లే చేస్తుంది. సినిమాలో ఆమె బాలయ్య కూతురి పాత్రలో కనిపించనుందని ప్రచారంలో ఉంది. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.