పవిత్రా నరేష్ ‘సెకండ్ ఇన్నింగ్స్’

సీనియర్ నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ తో కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకుంటున్న వీడియో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత వచ్చిన పెళ్లి వీడియో బాగా వైరల్ అయింది. దీంతో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ అసలు మేటర్ వేరే ఉంది. పవిత్రతో కలిసి నరేష్ ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్య బోల్డ్ సినిమాలు డైరెక్ట్ చేస్తున్న ఎమ్మెస్ రాజు దీనికి డైరెక్టర్ అట.

మొదటి పెళ్లి విఫలమైన ఓ జంట కలిసి సహజీవనం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కడం కథతో నరేష్ ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి నరేష్ నే నిర్మాత. నిజ జీవితంలో వారి కథనే స్క్రీన్ పై సినిమాగా ఎమ్మెస్ రాజు తీస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఒక్కో వీడియో రిలీజ్ చేస్తూ డిఫరెంట్ ప్రమోషన్ చేస్తున్నాడు నరేష్.

‘సెకండ్ ఇన్నింగ్స్’ టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలోనే ప్రమోషన్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో పవిత్రా నరేష్ మధ్య బోల్డ్ సీన్స్ ఉంటాయని , ఎమ్మెస్ రాజు ప్రీవీయస్ మూవీస్ లో కనిపించిన రొమాంటిక్ మోతాదు కూడా గట్టిగానే ఉండనుందని తెలుస్తుంది. ఆ లిప్ లాక్ సీన్ సినిమాలోనిదే అని సమాచారం. అలాంటి సీన్స్ సినిమాలో చాలా ఉంటాయని అంటున్నారు. మరి పవిత్రానరేష్ జంట ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.