రాజమౌళితో నటించిన హీరోలందరూ పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ స్టార్లు అయిపోతున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయారు. వీళ్లిద్దరినీ ఇప్పుడు అందరూ గ్లోబర్ స్టార్లుగా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఇద్దరికీ హాలీవుడ్లో నటించే అవకాశం వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో.
ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ పాత్రకు, అతడి పెర్ఫామెన్స్‌కు హాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం పడిపోయారు. ‘ఆర్ఆర్ఆర్’ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసే క్రమంలో చరణ్ వివిధ కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కాబట్టి భవిష్యత్తులో చరణ్‌కు హాలీవుడ్ కాలింగ్ కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు.
మరి ఈ విషయంలో చరణ్ ఆలోచనలు ఎలా ఉన్నాయి.. హాలీవుడ్లో అతడి ఫేవరెట్స్ ఎవరు.. అతను ఎవరితో సినిమాలు చేయాలనుకుంటున్నాడు అన్నది ఆసక్తికరం. ‘ఆస్కార్’ ప్రమోషన్ల కోసం యుఎస్‌లో ఉన్న అతను ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడాడు. ‘‘ఇప్పుడు సినిమా గ్లోబల్ అయిపోయింది. ఎవరు ఎక్కడైనా సినిమాలు చేయొచ్చు. సినీ గ్లోబలైజేషన్ టైంలో నేను ఇండస్ట్రీలో ఉండడం నా అదృష్టం. హాలీవుడ్లో నేను చాలామంది దర్శకులతో పని చేయాలని అనుకుంటున్నా. వారిలో జేజే అబ్రహామ్స్ ముందుంటారు. ఆయన తీసిన స్టార్ వార్స్ సినిమాలు నాకు చాలా ఇష్టం.
ఇక నేను చాలా అభిమానించే దర్శకుల్లో క్వింటిన్ టొరంటినో ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్’ నా ఆల్ టైం ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. ఈ దర్శకులు తమ సినిమాల్లో చేసే నటీనటులకు సవాలు విసురుతుంటారు. ఇక నేను కలిసి నటించాలనుకునే ఆర్టిస్టుల్లో టామ్ క్రూజ్ ఒకరు. ఆయన గొప్ప వ్యక్తి. అలాంటి నటుడితో కలిసి నటించే అవకాశం వస్తే అంతకంటే ఆనందం ఉండదు’’ అని చరణ్ తెలిపాడు.
This post was last modified on March 10, 2023 2:36 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…