ఇంటర్నెట్ లో సినిమాలు విడుదల చేయడానికి ఓటిటి ప్లాట్ ఫామ్ దొరికితే అక్కడ విడుదలయ్యే సినిమాలకు ప్రమాణాలు ఉండాలి కనుక పే పర్ వ్యూ పద్ధతిలో కొన్న వారికే సినిమా అంటూ వర్మ సినిమాల నిర్మాణం మొదలు పెట్టాడు. అచ్చంగ సినిమాల లాంటివి తీస్తే బానే ఉండేది. కానీ వేగంగా అతి తక్కువ ఖర్చుతో తీసేసి డబ్బులు దండుకోవాలని వర్మ ఎత్తు వేసాడు.
అందుకే పూర్తి నిడివి సినిమాలు కాకుండా.. ఇరవై నిముషాలు, నలభై నిమిషాల వీడియోలు తీసి వాటినే సినిమాలంటూ రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఇలాంటివి కొని చూసేంత వెర్రోళ్ళు కాదుగా జనాలు. అందుకే పైరసీలో చూసేస్తున్నారు. వర్మ తీసేవి సినిమాలైతే ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేయడం అదంతా పెద్ద పనయ్యేది. కానీ తక్కువ నిడివి వీడియోలు కావడంతో వాట్సాప్ లోనే షేర్ చేసేస్తున్నారు.
వర్మ తీసిన నగ్నం వీడియో అయితే పోర్న్ వెబ్ సైట్లలో పెట్టారు. చీప్ గా తీసేసి క్యాష్ చేసేసుకుందాం అనుకున్న వర్మ ప్లాన్స్ కి ఇలా మంగళం పడేసారు పైరేట్లు. ఇకనైనా ఈ వేదికకు తగ్గ సినిమాలు చేస్తాడో… లేక ఇంకా తన పప్పులు ఉడుకుతాయనే అనుకుంటాడో మరి?
This post was last modified on July 28, 2020 11:03 am
ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప 2…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…