ఇదేం ప్రచారం ‘రానా నాయుడు’ ?

వెంకటేష్ , రానా ఇద్దరు కలిసి ఫస్ట్ టైమ్ ‘రానా నాయుడు’ అనే సిరీస్ చేశారు. ఈ షో ఈ నెల 10న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సిరీస్ కోసం వెంకీ , రానాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముంబై తో పాటు హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ షో ఎలా ఉండబోతుందో ఇప్పటికే టీజర్ , ట్రైలర్ ద్వారా చెప్పేసిన వెంకీ, రానాలు ఈ షో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రెస్ మీట్లో అలాగే ఇంటర్వ్యూల్లో రానా పదే పదే అదే చెప్తున్నాడు. వెంకటేష్ , రానా చేసిన సిరీస్ కదా అని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని , సెపరేట్ గా ఎవరి రూమ్ లో వాళ్ళు లాప్ టాప్ లో చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. రానా , వెంకీ ఇలా చెప్పడానికి రీజన్ లేకపోలేదు. ఇది అడల్ట్ కంటెంట్ తో తీసిన సిరీస్. రొమాన్స్ లు , ఫైటింగ్ లు , ముఖ్యంగా ఈ తరహా సిరీస్ లో వినిపించే బూతులు కూడా గట్టిగా ఉంటాయి. అందుకే వెంకీ నటించాడు కదా ఫ్యామిలీస్ అంతా కలిసి హాల్ లో కూర్చొని చూస్తే ఎవరూ ఎంజాయ్ చేయలేరని రానా భావన.

ఈ షోకి ఇద్దరు హీరోలు ఉన్నట్టే ఇద్దరు దర్శకులు వర్క్ చేశారు. కరణ్ అన్షుమాన్ , సూపర్న్ వెర్మ డైరెక్ట్ చేశారు. అమెరికన్ సిరీస్ ‘రెయ్ డోనవన్’ కి రీమేక్ గా షో తెరకెక్కింది. మరి ఈ సిరీస్ తో బాబాయ్ , అబ్బాయ్ ఓటీటీ అడియన్స్ ను ఎలా మెప్పిస్తారో ?