భిన్నమైన నలుగురు మనుషుల మామూలు జీవితాలే “యాంగర్ టేల్స్” కథ. వాళ్ళ రోజువారీ సంఘటనలే “యాంగర్ టేల్స్” లో విషయం. వాళ్ళ జీవితాల్లోంచి మనల్ని ప్రయాణం చేయిస్తుంది “యాంగర్ టేల్స్”. వాళ్ళ మధ్య మనల్ని కూర్చోబెడుతుంది. వాళ్ళ ఫీలింగ్స్ ని మనం షేర్ చేసుకునేలా చేస్తుంది. ఆ నలుగురితో అంతలా కనెక్ట్ చేస్తుంది “యాంగర్ టేల్స్”.
“ఎవరైనా తిరగబడడం ఒక సమస్యకి ముగింపు.. పరిష్కారానికి శ్రీకారం” అని మన నమ్మకం. ఒక సగటు మనిషి ఎదురు తిరగాలంటే రెబెల్ అని ఒక ముద్ర పడడం మనం ఎందరి విషయంలోనే చూసి ఉంటాం. సాధారణమైన మనుషులు మన పాత్రలుగా ఎలా పరిణమించారు అనేదే ఈ కథ. మౌలికంగా ఇది మానసిక సంఘర్షణల కథ. ఆ సంఘర్షణ అందరిదీ అయి ఉంటుంది. అదే అందరినీ కలుపుతుంది. కానీ ఈ నలుగురిలో ఎవరి కథ ఎలాంటిదో.. ఎవరి కథలో ఎలాంటి మలుపులు ఉన్నాయో.. ఎన్ని మజిలీలు పొంచిఉన్నాయో.. వివరంగా చెబుతోంది “యాంగర్ టేల్స్”.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలైన ఈ సిరీస్ కి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రభల నితిన్ తిలక్ రాసి, దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో తరుణ్ భాస్కర్ , బిందు మాధవి, సుహాస్, మడోన్నా సెబాస్టియన్ , వెంకటేష్ మహా, ఫణి ఆచార్య గుర్తుండిపోయే పాత్రల్లో కనిపిస్తారు.
“యాంగర్ టేల్స్” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: http://bit.ly/3J0nHUt
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates