పెద్ద నిర్మాత అండగా ఉన్నా చిన్న సినిమాగా విడుదలై మొదటి వారం పూర్తి చేసుకున్న బలగం సెకండ్ వీక్ ప్రారంభంలోపే డబుల్ బ్రేక్ ఈవెన్ దాటేసి రెవిన్యూ పరంగా సూపర్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఏపీలో కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ తెలంగాణ జనాలు మాత్రం తమ నేటివిటీని ఇంత గొప్పగా చూపించిన సినిమాని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. పైగా సార్ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం ఏదీ లేకపోవడంతో ఆ అంశం బలగంకి బాగా కలిసి వస్తోంది. 3 కోట్ల షేర్ కి అతి దగ్గరగా ఉన్న ఈ ఎమోషనల్ డ్రామా గ్రాస్ రూపంలో ఏడు కోట్లను ఇవాళో రేపో టచ్ చేయబోతోంది.
థియేట్రికల్ బిజినెస్ కేవలం కోటి నలభై లక్షల్లోపే చేసిన నిర్మాత దిల్ రాజుకు స్వంతంగా చేసుకున్న రిలీజ్ మంచి ఫలితాలను తెచ్చి పెడుతోంది. బయ్యర్లు సైతం లాభ పడ్డారు. ఈ శుక్రవారం వస్తున్నవాటిలో దేనిమీద కనీస అంచనాలు లేకపోవడంతో దాన్ని బలగం మరోసారి క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. నైజామ్ ఏరియాలో టికెట్ రేట్లు తగ్గించి పెట్టడం మాస్ ని లాగుతోంది. ఆంధ్రలో ఆ సౌలభ్యం లేకపోవడం ప్రభావం చూపుతోంది. మార్చి 17 దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కనక దాన్ని బలగం ఎంతమేరకు వాడుకుంటుందో చూడాలి.
దర్శకుడు వేణు యెల్దెండ్ల కోరుకున్న దానికన్నా పెద్ద గుర్తింపు వచ్చింది. తనతోనే దిల్ రాజు ఈసారి పెద్ద బడ్జెట్ మూవీ ప్లాన్ ఉందని ఆల్రెడీ చెప్పేశారు. కేవలం ఎమోషనల్ డ్రామాలే కాకుండా కమర్షియల్ స్కేల్ లోనూ నిరూపొంచుకోవాలని వేణు ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి రాజుగారి మద్దతు దక్కడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలు జరుగుతున్నాయి. బలగం ఫలితం చూశాక మరికొన్ని ఈ తరహా జానర్లలో తీసేందుకు కొత్త దర్శకులు కథలు రాసుకుంటున్నారట. పది కోట్ల మార్క్ ని బలగం టచ్ చేయొచ్చనే అంచనాలున్నాయి కానీ అదంత సులభమైతే కాదు.
This post was last modified on March 10, 2023 10:05 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…