మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారతీయ స్పీల్బర్గ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి లీకులయితే జోరుగా వస్తున్నాయి కానీ ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కటి అఫీషియల్ అప్ డేట్ లేదు. అప్పుడెప్పుడో ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ చేయడం తప్పించి నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం లేదు. మార్చి 27 చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో టైటిల్ లాంచ్ చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని భాషలకు సరిపడేలా సిఈఓ టైటిల్ ని లాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్.
ఆ పేరుతో పాటు సినిమా ఉద్దేశాన్ని ప్రతిబింబించే క్యాప్షన్ కూడా పెడతారట. అయితే ఇదే ఫైనలా అంటే ఏమో ఖచ్చితంగా చెప్పలేమంటున్నాయి మెగా వర్గాలు. ప్రస్తుతానికి బలంగా లాక్ చేసిన వాటిలో ఇది ఉందని ఇంకో రెండు మూడు పరిశీలనలో ఉంచి ఈ వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయానికి వస్తారట. 2024 సంక్రాంతి విడుదలని ప్రకటించాలా వద్దా అనే మీమాంస నిర్మాత దిల్ రాజులో ఉన్నట్టు వినికిడి. ప్రాజెక్ట్ కె ఆల్రెడీ లాక్ చేశారు. కానీ వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. పుష్ప 2ని మైత్రి అదే టైంకి తీసుకొచ్చే పనైతే ఈ సిఈఓని కూడా రెడీ చేస్తారట.
బర్త్ డేతో పాటు దీని తాలూకు ఈవెంట్ ని భారీ ఎత్తున ప్లాన్ చేయబోతున్నారని సమాచారం. ఊహించని అతిథులను తీసుకురావడంతో పాటు దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరిగేలా ఎస్విసి టీమ్ కొత్త స్ట్రాటజీని సిద్ధం చేసినట్టు తెలిసింది. ఒకవేళ జనవరిలో వారసుడు రిలీజ్ లేకపోయి ఉంటే ఇది అప్పుడే చేయాలనుకున్నారు కానీ చివరాఖరికి మంచి అకేషన్ దొరికింది. ప్రస్తుతం దీనికి బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 కొనసాగిస్తున్న శంకర్ చరణ్ 15 కొత్త షెడ్యూల్ అతి త్వరలో మొదలుపెట్టబోతున్నారు. పెళ్లి సంబరాలు ముగించుకున్న కియారా అద్వానీ జాయినవబోతోంది.
This post was last modified on March 8, 2023 2:48 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…