ప్రభాస్ మూడ్రోజుల షూటింగ్

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తన బీజీ షెడ్యూల్ లో ఇచ్చిన కమిట్ మెంట్ కోసం ప్రభాస్ ఈ సినిమాకు నెలకి కొన్ని డేట్స్ చొప్పున అడ్జస్ట్ చేస్తూ ఘాట్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ జరిగాయి. నెలకి నాలుగైదు రోజులు ఇస్తూ వస్తున్న ప్రభాస్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మరో మూడు రోజులు కేటాయించనున్నాడు.

ఈ నెలాఖరున 28 నుండి ప్రభాస్ , మారుతి సినిమా షెడ్యుల్ మొదలు కానుంది. హైదరాబాద్లో జరగనున్న ఈ ఘాట్ లో మూడు రోజుల పాటు ప్రభాస్ పాల్గొంటాడు. ఆ తర్వాత, ముందు కొంతమంది నటీ నటులతో మిగతా సీన్స్ తీసే ఆలోచనలో ఉన్నాడు మారుతి. ఈ షెడ్యూల్ లో హీరోయిన్స్ తో కలిపి ప్రభాస్ సీన్స్ తీస్తారని తెలుస్తుంది. ఈ ఘాట్ కంప్లీట్ చేసి ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఘాట్ కి షిఫ్టవుతాడు. ఈ సినిమాను ఇదే ఏడాది రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ లుక్ తో వింటేజ్ డైలాగ్స్ తో మెప్పిస్తాడని యూనిట్ గట్టిగా చెప్తుంది. అన్ స్టాపబుల్ లో ప్రభాస్ ఎంత చలాకీ గా కనిపించాడో ఇందులో కూడా అంతే చలాకీ గా కనిపిస్తాడని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై నిర్మించబడుతున్న ఈ సినిమా హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.