ఒక్క హిట్ తో ఐదేళ్లు

ఏ హీరో కయినా ఎప్పటికప్పుడు సరైన హిట్ పడాలి. లేదంటే కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ, ఉన్న మార్కెట్ పడిపోవడం ఖాయం. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు కార్తికేయ. యంగ్ హీరోకి హిట్ వచ్చి ఐదేళ్లవుతుంది. మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత హీరోగా అరడజను సినిమాలు చేశాడు. కానీ ఒక్కటి ఆడలేదు. కొన్నైతే డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. మధ్యలో నాని ‘గ్యాంగ్ లీడర్’, అజిత్ ‘వలిమై’ సినిమాల్లో విలన్ గా నటించినా ఫలితం దక్కలేదు.

డెబ్యూతోనే కార్తికేయ కి సాలిడ్ హిట్ పడింది. ఆ సక్సెసే ఈ కుర్ర హీరోను ఇంకా బిజీగా ఉండేలా చేస్తుంది. కానీ ఇప్పుడు కార్తికేయ మార్కెట్ బాగా పడిపోయింది. ఈ హీరో సినిమాకి మినిమం కలెక్షన్స్ కూడా రావడం లేదు. ’90 ఎం ఎల్’ తో ఓ ప్రయోగం చేసినా టీవీలో హిట్ అనిపించుకుంది కానీ థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఇక కొత్తగా ట్రై చేసిన ‘గుణ 369’ కూడా వర్కవుట్ అవ్వలేదు. థ్రిల్లర్ జోనర్ లో చేసిన ‘రాజా విక్రమార్క’ కూడా ఫ్లాప్ అనిపించుకుంది. వీటి మధ్యలో వచ్చిన ‘హిప్పీ’ , ‘చావు కబురు చల్లగా’ గురించే చెప్పనక్కర్లేదు.

మరి ఐదేళ్ల క్రితం ప్రేక్షకులు ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తోనే కార్తికేయ తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. తెలుగులో హీరోల కొరత ఉండటంతో సక్సెస్ తో సంబంధం లేకుండా ఈ కుర్ర హీరోకి ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలోనే ‘బెదురు లంక’ అనే సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఈ సినిమా అయిన కార్తికేయకి హిట్ ఇస్తుందేమో చూడాలి. లేదంటే కార్తికేయ నవీన్ చంద్రలా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాల్సి వస్తుంది.