రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాల్లో ట్రైలర్ లో చూపించే దానికి మించి విషయం ఉండదని పలుమార్లు రుజువయింది. ఎంత సంచలనాత్మక అంశం తీసుకున్నా కానీ దానిని తలా తోక లేకుండా తీయడంలో వర్మ సిద్ధ హస్తుడు.
పలుమార్లు తన సినిమాలతో జనాన్ని బురిడీ కొట్టించినా కానీ ఇంకా ఇంకా అతడి పబ్లిసిటీ మాయలో పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని తెగ కామెడీ చేసేస్తాడు… పవర్ స్టార్ చూసి పవన్ ఫాన్స్ ని తెగ ట్రోల్ చేసేయవచ్చు అని యాంటీ ఫాన్స్ భావించారు.
తీరా చూస్తే గొర్రె తోక బెత్తెడు మాదిరిగా ఒక షార్ట్ వీడియోలో వర్మ ఏమీ చూపించకపోగా… రెండొందలకు పైగా రేట్ పెట్టి మరీ కొన్న వాళ్ళను తింగరోళ్లను చేసాడు.
వర్మ ఏదో పొడిచేస్తాడు అనుకుని వైసీపీ అనుకూల మీడియా ఈ సినిమాను తెగ హైప్ చేసింది. తీరా వాళ్ళకి కూడా ఫ్యూజులు అవుటయ్యాయి. ఇప్పుడు కూడా ఫూల్ అయినా కానీ మళ్ళీ అతని తదుపరి సినిమాకు ఇలాగే చేసి కామెడీ అవుతారు. అదే వర్మ స్పెషాలిటీ!
Gulte Telugu Telugu Political and Movie News Updates