పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో రెండు అప్ కమింగ్ సినిమాలు ఓపెనింగ్ చేశాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ తో చేయబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాగా మరొకటి సుజీత్ డైరెక్షన్ లో నటించనున్న OG. ఈ రెండు సినిమాలు ఓపెనింగ్ చేసేసి షూటింగ్ కి మాత్రం టైమ్ తీసుకుంటున్నాడు పవన్.
ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అదే వినోదాయ సీతమ్. తమిళ్లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను తెలుగులో కూడా సముద్రఖని నే డైరెక్ట్ చేయబోతున్నాడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఈ నెలలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా, ఓపెనింగ్ లేకుండానే సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ రీమేక్ కోసం పవన్ కేవలం ఇరవై రోజుల కాల్షీట్ ఇచ్చాడు. అంటే నెలలోపే ఈ సినిమాను కంప్లీట్ చేస్తాడన్న మాట. పవన్ తో సాయి ధరమ్ తేజ నటిస్తాడు. ఫస్ట్ టైమ్ మావయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు తేజ్.
ఈ సినిమా కోసం ఇప్పటికే పవన్ వర్కవుట్స్ మొదలుపెట్టాడు. ఫిట్ గా ఉండే లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇందులో మోడ్రన్ గాడ్ గా నటించనున్నాడు. ఇందుకోసం షూటింగ్ జరిగినన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉంటూ శాఖాహారం తీసుకునే ఆలోచనలో ఉన్నాడు.
ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. త్రివిక్రమ్ ఇప్పటికే తన వర్క్ కంప్లీట్ చేసేశాడు. మరికొందరు రైటర్స్ కూడా ఇందులో కొంత పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది.
This post was last modified on February 13, 2023 8:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…