జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నా కమర్షియల్ అంశాలతో హాస్యపు డామినేషన్ స్పష్టంగా కనిపించే మూవీ అదుర్స్. అందులో బ్రాహ్మణా ఆగ్రహారంలో గురు శిష్యులుగా తారక్ బ్రహ్మానందం పేల్చిన కామెడీ మాములుగా ఉండదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో వీళ్లిద్దరి ఎక్స్ ప్రెషన్లను మీమర్లు కొన్ని లక్షలసార్లు వాడుకుని ఉంటారు. ముఖ్యంగా చంద్రకళగా నటించిన నయనతారతో ప్రేమ పెళ్లి వ్యవహారంలో బ్రహ్మి ఇచ్చే హావభావాలు దానికి పడే కౌంటర్లు ఇప్పుడు చూసినా ఫ్రెష్ గా అనిపిస్తాయి. వివి వినాయక్ మార్కు యాక్షన్ తో పాటు అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి.
ఇప్పుడీ అదుర్స్ ని మార్చి 4న కొత్త ఫోర్ కె ప్రింట్ తో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆ మధ్య బాద్షా ఇలాగే చేశారు కానీ అది ఎబోవ్ యావరేజ్ మూవీ కావడం వల్ల ఫ్యాన్స్ ఎక్కువ సీరియస్ గా తీసుకోలేదు. కానీ అదుర్స్ అలా కాదు. మంచి సూపర్ హిట్ కంటెంట్ తో పాటు జూనియర్ డబుల్ యాక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, భారీ బడ్జెట్ లాంటి ఎన్నో హంగులతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఒక్క దశలో దీనికి సీక్వెల్ తీయాలని అనుకున్నారు కానీఫ్ ఫస్ట్ పార్ట్ ని మించే స్థాయిలో స్క్రిప్ట్ రాదేమోననే అనుమానంతో వినాయక్ డ్రాప్ అయ్యారు.
ఓ ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పారు. మార్చి 4 అదుర్స్ వస్తోంది. నిజానికి టైమింగ్ లో డిస్ట్రిబ్యూటర్లు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ వారంలో చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. మీడియం బడ్జెట్ వి రెండు మూడున్నాయి కానీ ఏ పోటీ లేని డ్రై పీరియడ్ అది. సో మళ్ళీ చారి భట్టుని తెరమీద చూడాలనుకున్న వాళ్లకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా నెలకు కనీసం రెండు మూడు రీ రిలీజులు క్రమం తప్పకుండ వస్తూనే ఉన్నాయి. ఈ 14న లవర్స్ డేకి నువ్వొస్తానంటే నేనొద్దంటానాని కొంచెం పెద్ద స్థాయిలో విడుదల చేస్తున్నారు. ప్రేమికులు క్యూ కడతారని కాబోలు
This post was last modified on February 12, 2023 3:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…