ప్రభాస్ చొరవతో జిల్ కాంబినేషన్

ఒక పెద్ద స్టార్ తో ప్యాన్ ఇండియా డిజాస్టర్ పడితే ఆ తర్వాత ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం యువ దర్శకులకు పెద్ద సవాల్. ఎందుకంటే స్థాయిని తగ్గించుకుని చిన్న హీరోలు మీడియం బడ్జెట్ తో చేయలేరు. ఆలా తీస్తే స్థాయి పడిపోయిందంటారు. అలా అని తొందరపడి మరో దెబ్బ తగిలితే కోలుకోవడం కష్టం. అందుకే సాహో తరువాత సుజిత్ చాలా ఓపిగ్గా ఎదురు చూశాడు. చిరంజీవి గాడ్ ఫాదర్ చేయి దాకా వచ్చి జారిపోయినా ఫీలవ్వలేదు. కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ తో లాక్ చేసుకున్నాడు. OG ట్యాగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో రచ్చ చేస్తోందో చూస్తున్నాం.

ఇప్పుడిదే పరిస్థితిలో రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఉన్నాడు. అది వచ్చి ఇంకో రెండు నెలల్లో ఏడాది అవుతుంది. ఇప్పటిదాకా కొత్త సినిమా ఏంటో కన్ఫర్మ్ కాలేదు. తనను ప్రభాస్ విపరీతంగా నమ్మాడు నమ్ముతున్నాడు. అందుకే యువి బ్యానర్ లోనే ప్రాణ స్నేహితుడు గోపిచంద్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని సెట్ చేసే విధంగా ఆల్మోస్ట్ ప్లానింగ్ మొత్తం జరిగిపోయింది. స్క్రిప్ట్ లాక్ అయ్యాక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే కాంబోలో రాధాకృష్ణ డెబ్యూ జిల్ వచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్ రికార్డులు రాలేదు కానీ డీసెంట్ సక్సెస్ అందుకుని పేరు తెచ్చింది.

ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తుంది. గోపీచంద్ ప్రస్తుతం రామబాణం పూర్తి చేసే పనిలో ఉన్నాడు.గత కొన్నేళ్లుగా వరస పరాజయాలతో మార్కెట్ బాగా దెబ్బ తిన్న తనకు పక్కా కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ఎదురు చూస్తే అటు మారుతీకి సైతం షాక్ కొట్టింది. ఈ పరిణామల నేపథ్యంలో శ్రీవాస్ డైరెక్షన్ లో రాబోతున్న రామబాణం మీద చాలా పాజిటివ్ గా ఉన్నాడు. జిల్ లో చూపించినంత స్టయిలిష్ గా ఇంకెవరూ చూపించలేదు కాబట్టి మరోసారి రాధాకృష్ణ నుంచి అదే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అఫీషియల్ అయ్యేదాకా ఇది సస్పెన్సే.