కళ్యాణ్ రామ్ కి కలిసొచ్చినట్టే !

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ నెల 10న అమిగోస్ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రాజేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫర్ ది ఫస్ట్ టైమ్ కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడు. మూడు డిఫరెంట్ పాత్రలతో కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రయోగం ఇది. టీజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో అమిగోస్ మంచి ఓపెనింగ్స్ అందుకే అవకాశం ఉంది. పైగా ఈ సినిమాకు తెలుగులో మరో పోటీ కూడా లేదు. ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’ ఒక్కటి పోటీ ఉంది. కానీ ఆ సినిమాపై తెలుగులో పెద్దగా బజ్ లేదు. పాప్ కార్న్ లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న వాటి ప్రభావం ఏ మాత్రం ఉండదని తెలిసిందే.

ఎలా చూసిన కళ్యాణ్ రామ్ కి అన్నీ కలిసొచ్చినట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా రిలీజ్ కి ముందు వచ్చిన కంటెంట్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. కళ్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయోగానికి ఆశించిన టాక్ వస్తే భారీ వసూళ్లు అందుకునే అవకాశం ఉంది. బింబిసార కి సీతా రామం టఫ్ ఇచ్చినట్టు కళ్యాణ్ రామ్ కి ఈసారి అలాంటి పోటీ లేదు. మరి మూడు డిఫరెంట్ కేరెక్టర్స్ తో కళ్యాణ్ రామ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.