జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల బాధ మామూలుగా లేదు కొంత కాలంగా. టాలీవుడ్లో మిగతా స్టార్ హీరోలంతా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ.. సగటున ఏడాదికో రిలీజ్ ఉండేలా చూసుకుంటుంటే.. తారక్ మాత్రం ఏడాదికి పైగా కెమెరా ముందుకే వెళ్లలేదు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం మూడేళ్లకు పైగా సమయం పెట్టిన తారక్.. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక కూడా కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోతుండడం.. కొరటాల శివతో చేయాల్సిన సినిమా షూటింగ్ ఎంతకీ ఆరంభం కాకపోవడం వారికి ఏమాత్రం రుచించడం లేదు.
ఇదిగో అదిగో అంటున్నారే తప్ప.. కొరటాల సినిమా సెట్స్ మీదికి మాత్రం వెళ్లడం లేదు. తారక్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ అంతకంతకూ పెరిగిపోయి సోషల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
అభిమానుల వేడి ‘ఎన్టీఆర్30’ టీంకు కూడా అర్థమైనట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్ల మాదిరి జాప్యం చేస్తూ కూర్చుంటే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని భావించి ఇక వీలైనంత త్వరగా షూట్ మొదలుపెట్డానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి రెండో వారంలో చిత్రీకరణ మొదలవుతుందని.. ఇది ఫైనల్ అని.. ఇందులో ఏ సందేహాలూ పెట్టుకోవాల్సిన పని లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి. పక్కాగా అన్నీ రెడీ చేసుకుని షూటింగ్‌లోకి దిగుతారని.. వీలైనంత వేగంగా సినిమాను పూర్తి చేస్తారని సమాచారం.
సినిమాలో తన పాత్ర కోసం తారక్ ఇక ప్రిపరేషన్ మొదలుపెట్టనున్నాడట. నెల రోజుల్లో అతను మంచి షేప్, కొత్త లుక్‌లోకి మారనున్నాడట. ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని కవర్ చేసేలా ప్రశాంత్ నీల్ సినిమాను కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని.. సెప్టెంబరులో ‘సలార్’ రిలీజ్ అవ్వగానే తారక్ సినిమా ట్షూ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ అప్‌డేట్స్ తారక్ ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చేవే.
This post was last modified on February 4, 2023 4:55 pm
జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…