పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. పవన్ తో జల్సా నుండి త్రివిక్రమ్ ఫ్రెండ్ షిప్ మొదలైంది. ఆ సినిమా తర్వాత ఇద్దరు ‘అత్తరింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు చేశారు. తీన్ మార్ , భీమ్లా నాయక్ కి త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. తను దర్శకుడిగా మారాక మరొకరి సినిమాకి స్క్రీన్ ప్లే , మాటలు రాయడం ఒక్క పవన్ విషయంలోనే జరిగింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు రావాల్సింది. మహేష్ కంటే ముందు త్రివిక్రమ్ అతడు కథను పవన్ కే చెప్పాడు.
అతడు కథ చెప్తుంటే పవన్ పడుకున్నారంటూ త్రివిక్రమ్ పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. అయితే పవన్ మాత్రం దానిపై ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఈ విషయం గురించి బాలయ్య వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తూ పవన్ మాట్లాడాడు. త్రివిక్రమ్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఫామౌజ్ లో ఏదో పనులు చేస్తూ ఉన్నానంటూ చెప్పుకున్నాడు.
అయితే అతడు కథ చెప్పినప్పుడు పడుకున్నానని త్రివిక్రమ్ ఇప్పటికీ అంటుంటాడని , లేదు పడుకోలేదని నేను వాదిస్తానని పవన్ ఈ సందర్భంగా చెప్పాడు. అయితే ఇప్పటికీ ఆ గొడవ తేలలేదని త్రివిక్రమ్ దాన్ని వదలకుండా అప్పుడప్పుడూ గుర్తుచేస్తుంటాడని పవన్ అన్నాడు. ఇక బాలయ్య పవన్ కి సంబంధించి ఓ ఫోటో చూపించి ఫోన్లో ఎవరు త్రివిక్రమ్ ఆ? అని అడగ్గా పవన్ ఆయనే అయ్యి ఉంటాడు నాకు గుర్తులేదు అంటూ తెలిపాడు. ఏదేమైనా అతడు కథ విన్నప్పుడు పవన్ నిజంగానే పడుకున్నాడా ? లేదా ? అనేది మాత్రం ఇంకా వారిద్దరి మధ్య టాపిక్ లా ఉండి పోయిందన్నమాట.
This post was last modified on February 3, 2023 9:47 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…