త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కామనే. కాకపోతే సెకండ్ హీరోయిన్ కి కథలో అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. జస్ట్ సెంటిమెంట్ కోసమో లేదా గ్లామర్ కోసమో త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా చూసుకుంటాడు. ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ తీసిన ఏ సినిమా చూసిన సెకండ్ హీరోయిన్ ఇంపార్టెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. ‘అల వైకుంఠ పురములో’ లో నివేత్త పేతురాజ్ ను పెట్టుకొని ఆమెకి మూడు నాలుగు సీన్స్ మాత్రమే డిజైన్ చేశాడు త్రివిక్రమ్. ఇక ‘అరవింద సమెత’ లో ఈశా రెబ్బ పరిస్థితి కూడా అంతే. ‘అఆ’ లో మాత్రం అనుపమ కి కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సమంత కేరెక్టర్ ముందు అనుపమ పాత్ర తేలిపోయింది.
ఇప్పుడు మహేష్ సినిమా కోసం పూజతో పాటు శ్రీ లీలను మరో హీరోయిన్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్. త్వరలోనే పూజ హెగ్డే , శ్రీలీల ఇద్దరు సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో పూజ తో పాటు శ్రీలీల కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నాడట త్రివిక్రమ్. మెయిన్ హీరోయిన్ పూజ నే కానీ శ్రీ లీల క్రేజ్ చూసి ఆమెకి మరిన్ని సీన్స్ యాడ్ చేశారని తెలుస్తుంది.
ఇటీవలే నిర్మాత నాగ వంశీ కూడా శ్రీలీల సెకండ్ హీరోయిన్ కాదని , తమ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని గట్టిగా చెప్పుకున్నాడు. సో నిర్మాత వంశీ మాటలను బట్టి చూస్తే త్రివిక్రమ్ ఈసారి రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తెరకెక్కిస్తాడాని అర్థమవుతుంది. ఏ మాటకామాటే పూజ కంటే శ్రీ లీలకే ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉంది. ధమాకా కలెక్షన్స్ లో రవితేజ తర్వాత కీలక భాగం శ్రీలీలకే చెందుతుంది. ఆమె కోసమే రిపీట్ గా టికెట్లు తేగాయి. ఇప్పుడు మహేష్ తో శ్రీలీల అంటే ఈ పెయిర్ స్క్రీన్ మీద అదిరిపోవడం ఖాయం అనే ఆసక్తితో ఉన్నారు. ఇక మహేష్ తో పూజ ఆల్రెడీ మహర్షి చేసింది కాబట్టి ఈ కాంబో మీద ఆడియన్స్ కి పెద్దగా ఆసక్తి లేదు. ఏదేమైనా త్రివిక్రమ్ తన ఆలోచన మార్చుకొని శ్రీలీలకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేలానే ఉన్నాడు.
This post was last modified on February 3, 2023 9:06 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…