పవన్ నోట బాలయ్య మాట

బాలయ్య ఆహా వీడియో కోసం హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 పూర్తయింది. పవన్ కళ్యాణ్ తో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చేసి సీజన్ 2 ఎండ్ కార్డ్ వేసేశాడు బాలయ్య. ప్రభాస్ ఎపిసోడ్స్ లానే పవన్ ఎపిసోడ్స్ ను కూడా రెండు భాగాలుగా వదలబోతున్నారు. ఫిబ్రవరి ౩న రాబోతున్న పార్ట్ 1 ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో పవన్ ను బాలయ్య “ఈశ్వరా… పవనేశ్వర” అంటూ వెల్కం చెప్పడం , అలాగే “నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు” అంటూ బాలయ్య షో ఆరంభంలో చెప్పే డైలాగ్ ను పవన్ చెప్పడం ప్రోమోలో హైలైట్ గా కనిపిస్తుంది.

మొదటి ఎపిసోడ్ లో బాలయ్య పవన్ లైఫ్ స్టైల్ గురించి తన మెంటాలిటీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. ఇక సాయి ధరం తేజ్ ఎంట్రీ, ఇద్దరితో సరదాగా మాట్లాడటం బాలయ్య తొడ కొట్టే ప్రయత్నం చేయడం హాస్యం తెప్పించింది. పవన్ ను బాలయ్య మనం మొదటి సారి ఎక్కడ కలిశామో గుర్తుందా ? అంటూ పవన్ ను అడుగుతూ సుస్వాగతం ఓపెనింగ్ స్టిల్ చూపించడం , రామ్ చరణ్ కాల్ చేసినప్పుడు “ఏమయ్యా ఫిట్టింగ్ మాస్టర్” అని బాలయ్య అనడం. ఇవన్నీ పార్ట్ 1 పై ఆసక్తి పెంచుతున్నాయి. అలాగే బాలయ్య పవన్ పెళ్ళిళ్ళ గురించి అడిగే విషయం కూడా ప్రోమోలో హైలైట్ చేశారు.

అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ప్రభాస్ ఎపిసోడ్ కి కూడా ఇంతకంటే ఎక్కువే ఆహా టీం ప్రమోట్ చేసి ప్రోమోలతో హంగామా చేసింది. కంటెంట్ ను రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. కానీ ఒక ఎపిసోడ్ ను లాగి లాగి రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయడం కాస్త తేడా కొట్టింది. దీంతో ప్రభాస్ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ అవ్వలేదు. మరి ఇప్పుడు పవన్ ఎపిసోడ్ కి ఆహా టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చూడాలి.