రామ్ చరణ్ క్యారెక్టర్ లెంగ్త్ తగ్గించేశారు?

ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్ర చరణ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి, కొరటాల శివ భావించారు. అందుకు రామ్ చరణ్ కూడా సిద్ధంగానే ఉండడంతో… అతిథి పాత్రలా కాకుండా కనీసం అరగంట నిడివి ఉండేలా తీర్చి దిద్దాలని భావించారు. లాక్ డౌన్ ముందు వరకు చరణ్ పాత్ర లెంగ్త్ అంతే అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల ఆర్.ఆర్.ఆర్. వెనక్కి వెళ్లడంతో ఆచార్య ముందుగా విడుదల కావడం ఖాయమైంది.

అయితే తన సినిమా వచ్చేలోగా చరణ్ ఒక పూర్తి స్థాయి పాత్రలో కనిపించడం రాజమౌళికి ఇష్టం లేదు. అందుకని ఆ పాత్రను ముందుగా అనుకున్నట్టు అతిథి పాత్రగా మార్చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి కానీ, ఆచార్య తదుపరి ప్రణాళిక గురించి కానీ చిరు, కొరటాల లేదా నిర్మాత చరణ్ ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. షూటింగ్స్ మొదలైన తర్వాత ఆర్.ఆర్.ఆర్. కి సంబంధించి తారక్ సీన్స్ ముందు పూర్తి చేస్తారంటున్నారు. బహుశా ఆ టైములో చరణ్ ఆచార్య పని కానిచ్చేస్తాడేమో.