ఆర్ఆర్ఆర్ సినిమా చూసి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఎగ్జైట్ అయిన తీరు.. మన దర్శక ధీరుడు రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నిజంగా ఈ సినిమాలో ఇంత విషయం ఉందా అని మనవాళ్లే ఇప్పుడు ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్‌కే ఇలా ఎగ్జైట్ అయిన కామెరూన్.. రాజమౌళి బెస్ట్ మూవీగా అందరూ పరిగణించే బాహుబలిని చూస్తే ఇంకెంత ఉద్వేగానికి గురవుతాడో అన్న చర్చ నడుస్తోంది.
కామెరూన్ అనే కాక ఆర్ఆర్ఆర్‌ను చూసి అబ్బురపడుతూ కొన్ని నెలలుగా ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్న హాలీవుడ్ ప్రముఖులు, అమెరికన్ ఆడియన్స్.. బాహుబలిని చూస్తే ఏమైపోతారో అన్న డిస్కషన్లు సోషల్ మీడియాలో నడుస్తున్నాయిప్పుడు.
నిజానికి మన వాళ్లకు బాహుబలి ఇచ్చిన హై.. ఆర్ఆర్ఆర్ ఇవ్వలేదనే చెప్పాలి. ఇప్పటికీ ఇండియన్ ఆడియన్స్ అందరూ బాహుబలినే గొప్పగా భావిస్తారు. అందులో బాహుబలి పాత్రను తీర్చిదిద్దిన విధానం.. హీరో ఎలివేషన్లు.. విజువల్ ఎఫెక్ట్స్.. ఎమోషన్లు.. బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నీ కూడా పతాక స్థాయిలో అనిపిస్తాయి. బాహుబలి-1, 2 రెండింట్లోనూ ఇంటర్వెల్ ఎపిసోడ్లు మామూలు హై ఇవ్వవు. అందులోని యాక్షన్ ఘట్టాల గురించి, భారీతనం, విజువలైజేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఐతే ఆ సినిమా వచ్చినపుడు ఇంటర్నేషనల్ రీచ్ పెద్దగా రాలేదు. అమెరికాలో ఇండియన్ ఆడియన్స్ మాత్రమే ఆ సినిమా చూశారు. జపాన్ లాంటి కొన్ని దేశాల్లో సినిమా బాగా ఆడింది. దాన్ని అంతర్జాతీయ స్థాయిలో సరిగా ప్రమోట్ చేయలేదు. కానీ ఇప్పుడు బాహుబలిని కొంచెం ప్రమోట్ చేసి స్పెషల్ షోలు వేస్తే కామెరూన్ సహా అందరూ మరింత అబ్బురపడతారేమో.
This post was last modified on January 23, 2023 6:16 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…