అక్కినేని అభిమానులు ఎదురుచూసే కొద్దీ ఏజెంట్ విడుదల ఎంతకీ తెమలడం లేదు. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కనక క్లిక్ అయితే తమ హీరోలు మాస్ లో కోల్పోయిన పట్టుని తిరిగి సాధించుకోవచ్చనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. క్లైమాక్స్ కోసమే ఎక్కువ టైం తీసుకుంటున్న దర్శకుడు సురేందర్ రెడ్డి దాన్ని రెండు వెర్షన్లుగా తీస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఫైనల్ గా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఏది బెటర్ అనిపిస్తే దానికి ఫిక్స్ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారట. ఈ లెక్కన ఏప్రిల్ లో రిలీజ్ కావడం మీద అనుమానాలు ఇంకా తొలగిపోలేదు.
ఇదిలా ఉండగా శాండల్ వుడ్ నుంచి కెజిఎఫ్, కాంతార లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో సత్తా చాటిన హోంబాలే ఫిలింస్ త్వరలో అఖిల్ తోనూ ఒక క్రేజీ మూవీని ప్లాన్ చేసిందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా చెప్పకపోయినా ప్రాధమికంగా చర్చలు జరిగాయని, దర్శకుడిని ఫైనల్ చేశాక ప్రకటన ఇస్తారని సమాచారం. రాబోయే రోజుల్లో మూడు వేల కోట్లతో సినిమాలు ప్లాన్ చేసుకున్న అలాంటి బ్యానర్ తో అఖిల్ జట్టు కడితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ రేంజ్ ని ఆశించవచ్చు. అయితే డైరెక్టర్ ఎవరన్నది కీలకం. పైకి చూస్తేనేమో అగ్ర దర్శకులందరూ బిజీగా ఉన్నారు. హోంబాలే మనసులో ఎవరున్నారో.
మొత్తానికి అఖిల్ స్కెచ్చులు చూసేందుకు బాగున్నాయి కానీ వీటికి స్పీడ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవైపు తన రేంజ్ హీరోలు దూసుకుపోతున్నారు. అన్నయ్య నాగ చైతన్య ఒక పరిధి దాటి మాస్ ని ఎక్కువ ఆకట్టుకోలేక కొత్త ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. అలాంటప్పుడు కమర్షియల్ మార్కెట్ మీద పట్టు సాధించాలంటే అఖిల్ ఫోకస్ పెంచాలి. నాగార్జున సైతం బంగార్రాజు తప్ప వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, బిగ్ బాస్ సీజన్ 6 ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఏదున్నా మూడో తరంలో చివరి వారసుడిగా అఖిల్ మీదే బరువెక్కువ ఉంది. దాన్ని మోయడం పెద్ద సవాలే.
This post was last modified on January 18, 2023 1:47 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…