రెగ్యులర్ కథలను కాకుండా కాస్త డిఫరెంట్ గా అనిపించే సబ్జెక్టులను ఎంచుకుంటాడనే పేరున్న సుధీర్ బాబు కొత్త సినిమా హంట్ ఈ నెల 26న విడుదల కాబోతోంది. సంక్రాంతి హడావిడిలో పడిపోయి కొత్తవాటి గురించి అంతగా ఫోకస్ రావడం లేదు కానీ 25న పఠాన్ తో బాక్సాఫీస్ మీద దండయాత్ర మొదలుకానుంది. గత రెండు సినిమాలు శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తీవ్రంగా నిరాశపరిచిన నేపథ్యంలో సుధీర్ బాబు ఆశలన్నీ హంట్ మీదే ఉన్నాయి. మహేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ట్రైలర్ ఇందాకా ప్రభాస్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
అర్జున్(సుధీర్ బాబు)ఒక పోలీస్ ఆఫీసర్. యాక్సిడెంట్ లో తన గతమంతా మర్చిపోతాడు. కానీ ఒక ముఖ్యమైన హై ప్రొఫైల్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగం కావాల్సి వస్తుంది. తన కొలీగ్(భరత్)తో పాటు పైఅధికారి(శ్రీకాంత్) సహకారంతో దాని లోతుపాతుల్లోకి వెళ్తాడు. అసలు అర్జున్ రెండు రకాలుగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది, ఇంత పెద్ద ట్రాప్ నుంచి ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ చుట్టూ హంట్ జరుగుతుంది. విజువల్స్, స్టంట్స్ గట్రా భారీగా ఉన్నాయి. గన్నులు బులెట్లు కాల్చుకోవడాలు పరిగెత్తడాలు ఫక్తు యాక్షన్ లవర్స్ కోరుకునే అంశాలన్నీ ఇందులో పొందుపరిచారు.
కొన్నేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ ముంబై పోలీస్ స్ఫూర్తితో ఈ హంట్ రూపొందినట్టు వచ్చిన వార్త నిజమనేలానే సీన్లు వగైరా ఉన్నాయి. గిబ్రాన్ సంగీతం బాగా ఎలివేట్ చేసింది. అరుళ్ విన్సెంట్ ఛాయాగ్రహణం టెక్నికల్ గా సపోర్ట్ చేశాయి. సుధీర్ బాబుకి నటన పరంగా ఛాలెంజ్ అనిపించే పాత్రనే ఎంచుకున్నాడు. స్పైడర్ తర్వాత తెలుగులో మళ్ళీ కనిపించని భరత్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కంటెంట్ కనక కరెక్ట్ గా కుదిరితే చెప్పుకోదగ్గ పోటీ లేని 26న హంట్ బాక్సాఫీస్ దగ్గర ఈజీగా కుదురుకోవచ్చు. కాకపోతే షారుఖ్ ఖాన్ పఠాన్ ని మాత్రం బలంగా ఎదురుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on January 18, 2023 10:46 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…