బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య దూకుడు మాములుగా లేదు. సంక్రాంతి రేస్ లో వీరసింహారెడ్డి కన్నా ఒక రోజు ఆలస్యంగా రావడం పట్ల మెగా ఫ్యాన్స్ ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ దాన్ని పటాపంచలు చేస్తూ అన్ని సెంటర్లలో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజులకు 100 కోట్ల గ్రాస్ ని దాటేసి సరికొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. యుఎస్ లో 1.7 మిలియన్ డాలర్ల మార్కుని ఓవర్ టేక్ చేసి అక్కడా సంచలనాలు నమోదు చేస్తోంది. వారం పూర్తయ్యేలోగా సులభంగా టూ మిలియన్ మైలు రాయిని అందుకోవడం చాలా సులభంగా కనిపిస్తోంది. బుకింగ్స్ స్టడీగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అనూహ్యంగా థియేటర్ల కౌంట్ పెంచాల్సి రావడం, బిసి కేంద్రాల్లో ఆడియన్స్ డిమాండ్ మేరకు అదనపు షోలను ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ వీరయ్య వీరంగానికి సూచికగానే చెప్పుకోవాలి. పండగ సీజన్ కావడంతో సాధారణంగా ఉండే జోరు కన్నా రెండుమూడింతలు ఎక్కువగానే కనిపిస్తోంది.వీరసింహారెడ్డికి సైతం మంచి ఫిగర్లు నమోదవుతున్నా చిరు డామినేషన్ తో పోలిస్తే అవి తక్కువ కావడంతో హైలైట్ కావడం లేదు. అరవై కోట్లకు పైగా షేర్ తో వీకెండ్ ని ఘనంగా ముగించిన వాల్తేరు వీరయ్య ఫిగర్లను పోస్టర్ల రూపంలో అఫీషియల్ చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా మైత్రి నుంచి స్పందన లేదు.
టాలీవుడ్ కు సంక్రాంతి ఎంత కీలకమో మరోసారి స్పష్టంగా ఋజువవుతోంది. యావరేజ్ ఉన్నా పర్లేదు అన్నా స్టార్ హీరోలతో సరైన కమర్షియల్ సినిమాను కనక ఇవ్వగలిగితే వసూళ్ల సునామి ఖాయమని మరోసారి క్లారిటీ వచ్చింది. గతంలోనూ సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు లాంటి చిత్రాల టాక్ ఆటుఇటు ఊగినా సరే స్టార్ పవర్ సహాయంతో నిర్మాతకు లాభాలు తెచ్చాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు సైతం అదే సీన్ రిపీట్ చేస్తున్నాయి. ఇవాళ రేపు పండగ సెలవుల హడావిడి ముగిసిపోతుంది కాబట్టి అసలైన పరీక్ష తిరిగి బుధవారం నుంచి మొదలుకానుంది.
This post was last modified on January 17, 2023 8:21 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…