చూడ్డానికి బాగుంటాడు. యాక్టింగ్ స్కిల్స్‌కు ఢోకా లేదు. మంచి ఈజ్‌తో నటిస్తాడు. పక్కింటి కుర్రాడి పాత్రలకు బాగా సూటవుతాడు. ఏవైనా భిన్నమైన పాత్రలు ఇచ్చినా చేసే టాలెంట్ ఉంది. ఫ్యామిలీ బ్యాకప్ లేకపోయినా.. ఇండస్ట్రీలో మంచి అండదండలు ఉన్నాయి. కానీ ఏం లాభం సరైన సినిమాలు ఎంచుకోక తడబడతుతున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.
దివంగత దర్శకుడు శోభన్ తనయుడైన ఈ కుర్రాడు.. ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాతో స్కూల్ కుర్రాడి పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘తను నేను’తో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా సరిగా ఆడకపోయినా.. అతడికి అవకాశాలు బాగానే వచ్చాయి. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్.. ఇలా వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
వీటిలో ఓటీటీలో రిలీజైన ‘ఏక్ మినీ కథ’ మాత్రం ఆకట్టుకుంది. మిగతా సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. థియేటర్లలో ఈ సినిమాలేవీ మినిమం ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. కుర్రాడికి మంచి టాలెంట్ ఉన్నా.. దాన్ని ఉపయోగించుకునే దర్శకుడే కరవైపోయాడు. తాజాగా సంతోష్ ‘కళ్యాణం కమనీయం’ చిత్రంతో సంక్రాంతి రేసులోకి దిగి తల బొప్పి కట్టించుకున్నాడు.
సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య పోటీకి నిలిస్తే ఏదో అనుకున్నారు కానీ.. ‘కళ్యాణం కమనీయం’ పూర్తిగా నిరాశ పరిచింది. ఈ సినిమా గురించి సంతోష్ చెప్పిన మాటలన్నీ ఎగ్జాజరేషనే. ఎప్పట్లాగే సినిమా బాలేకపోయినా.. సంతోష్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంత ఈజ్ పెట్టుకుని ఇవేం సినిమాలు అనే అభిప్రాయం జనాల్లో కలుగుతోంది.
సంతోష్ తండ్రి శోభన్ మీద ప్రభాస్‌కు ఉన్న అభిమానం వల్ల సంతోష్‌తో యువి వాళ్లు రెండు సినిమాలు చేశారు. కానీ రెండో సినిమాతో చేదు అనుభవం తప్పలేదు. ఎంత టాలెంట్, బ్యాకప్ ఉన్నా సరైన సినిమాలు ఎంచుకోకుంటే కెరీర్ తిరోగమనంలో పయనించాల్సిందే. మరి రాబోయే చిత్రాలు ‘ప్రేమ్ కుమార్’, ‘అన్నీ మంచి శకునములే’ అయినా సంతోష్ కెరీర్‌ను నిలబెడతాయేమో చూడాలి.
This post was last modified on January 16, 2023 9:00 am
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి…
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…