రౌడీ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న VD12 కి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఖుషి’ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ కాంబో సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ నిర్మించబోతున్నాడు. ఇటీవలే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు గౌతం. జెర్సీ హిందీ తర్వాత రామ్ చరణ్ తో గౌతం సినిమా ఎనౌన్స్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే విజయ్ ను అప్రోచ్ అయ్యాడు గౌతం. మార్చి లేదా ఏప్రిల్ నుండి షూటింగ్ ఈ కాంబో సినిమా షూట్ మొదలు కానుంది. ఈ లోపు విజయ్ ‘ఖుషి’ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. సమంత డేట్స్ కారణంగా వాయిదా పడిన ఖుషి ఘాట్ త్వరలోనే మొదలు కానుంది.
అయితే రామ్ చరణ్ కి చెప్పిన కథతోనే విజయ్ సినిమా ఉంటుందా? లేదా గౌతం రౌడీ కోసం ఇంకో కథ రెడీ చేశాడా ? తెలియాల్సి ఉంది. ఈ కినేమకు సంబందించి మరిన్ని డీటైల్స్ త్వరలో రాబోతున్నాయి. లైగర్ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన విజయ్ ఖుషి , గౌతం తిన్ననూరి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ డెలివరీ చేయాలని భావిస్తున్నాడు. మరి ఈ సినిమాలు విజయ్ కి ఎలాంటి విజయం అందిస్తాయో చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…