నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు తిరిగి పీక్స్‌ను అందుకుని చెప్పొచ్చు. యన్.టి.ఆర్-1, 2.. రూలర్ సినిమాలతో బాగా డౌన్ అయినట్లు కనిపించిన ఆయన కెరీర్ ‘అఖండ’తో అనూహ్యంగా పుంజుకుంది. అన్ స్టాపబుల్ టాక్ షో కూడా బాలయ్య క్రేజ్, ఇమేజ్ పెరగడానికి కారణమైంది. ఇలాంటి టైంలో ‘క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన గోపీచంద్ మలినేనితో జట్టు కట్టడం.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సంక్రాంతికి మంచి డేట్‌లో సినిమా రిలీజ్ కావడం.. అన్నీ ప్లస్సయ్యాయి బాలయ్యకు.
ఈ నందమూరి హీరో కెరీర్లోనే అత్యధిక లొకేషన్లు, స్క్రీన్లు, షోలతో రిలీజైన సినిమా ‘వీరసింహారెడ్డి’నే. తెలుగు రాష్ట్రాల్లో అయితే మెజారిటీ స్క్రీన్లను బాలయ్యకు ఇచ్చేశారు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ గురువారం ఈ సినిమానే ప్రదర్శించారు. సినిమాకు హైప్ కూడా బాగా ఉండడం వల్ల ఈ అడ్వాంటేజీని బాగా ఉపయోగించుకుంది.
‘వీరసింహారెడ్డి’కి తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా సరే.. అది వసూళ్ల మీద ఏమంత ప్రభావం చూపించినట్లు కనిపించడం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అలాగే బెంగళూరు లాంటి ఇండియన్ సిటీస్‌లో, యుఎస్‌లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది ఈ సినిమా. థియేటర్ల ముందు ఎటు చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపించాయి. ఈవెనింగ్, నైట్ షోలు మంచి ఆక్యుపెన్సీతో నడిచాయి. బాలయ్య కెరీర్లో అతి పెద్ద రిలీజ్ కావడం, ఫుల్ హౌస్‌లతో నడవడం వల్ల తొలి రోజు భారీ వసూళ్లు గ్యారెంటీ అన్నది పక్కా. బాలయ్య బాక్సాఫీస్ స్టామినాను మించి ఈ సినిమా తొలి రోజు పెర్ఫామ్ చేయబోతోందన్నది స్పష్టం.
మరీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలవకపోవచ్చు కానీ.. బాలయ్య వరకు కెరీర్ బెస్ట్ డే-1 వసూళ్లు కేక్ వాక్ అన్నది పక్కా. అఖండ సహా బాలయ్య సినిమాల తొలి రోజు వసూళ్లను పెద్ద మార్జిన్‌తో ‘వీరసింహారెడ్డి’ కొట్టబోతోంది. చిరు సినిమా ‘వాల్తేరు వీరయ్య’ టాక్‌ను బట్టి ‘వీరసింహారెడ్డి’ ఓవరాల్ రిజల్ట్ ఆధారపడి ఉండనుంది.
This post was last modified on January 13, 2023 9:02 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…