మెగాస్టార్ చిరంజీవికి బయట ఉన్న కోట్ల మంది అభిమానులకు తోడు.. సినీ పరిశ్రమలో కూడా పెద్ద సంఖ్యలోనే వీరాభిమానులు ఉన్నారు. అందులో ఇద్దరు ‘వాల్తేరు వీరయ్య’లో ఆయనతో కలిసి పని చేశారు. ఒకరు దర్శకుడు బాబీ అయితే.. ఇంకొకరు మాస్ రాజా రవితేజ. తాను చిరంజీవి అభిమానిని అని రవితేజ గతంలో పలుమార్లు చెప్పాడు. ‘అన్నయ్య’ సినిమాలో చిరు తమ్ముడిగా నటించినందుకు రవితేజ అప్పట్లో ఎంత ఎగ్జైట్ అయ్యాడో? ఆ తర్వాత హీరోగా పెద్ద రేంజికి వెళ్లినా సరే.. ‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు అంతే ఎగ్జైట్ అవుతున్నాడు.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో రవితేజ.. చిరు మీద తనకు చిన్నప్పట్నుంచీ ఉన్న అభిమానం గురించి మాట్లాడాడు. చిరంజీవి మీద తన అభిమానానికి విజయవాడ నాంది పలికిందని రవితేజ ఈ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు.
విజయవాడలో చిరంజీవి సినిమా ‘విజేత’ వంద రోజుల ఫంక్షన్ జరిగిందని.. పీడబ్ల్యూ మైదానంలో ఆ వేడుక చేశారని రవితేజ గుర్తు చేసుకున్నాడు. ఐతే మెగాస్టార్‌ను చూడడానికి వేలమంది అభిమానులు వచ్చారని.. దీంతో తాను చాలా దూరంగా ఉండిపోయానని.. చిరును దగ్గరగా కూడా చూడలేకపోయానని రవితేజ తెలిపాడు.
ఐతే అందుకు తానేమీ ఫీల్ కాలేదని.. ఏదో ఒక రోజు వెళ్లి చిరు పక్కన కూర్చుంటా అని తన స్నేహితుల దగ్గర చాలా ధీమాగా ఛాలెంజ్ చేశానని రవితేజ చెప్పాడు. ఆపై తాను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి హీరో ఫ్రెండుగా చిన్న చిన్న వేషాలు వేసి.. ‘అన్నయ్య’ సినిమాలో చిరుకు సోదరుడిగా నటించే గొప్ప అవకాశం అందుకున్నానని.. మళ్లీ ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లో ఆయనతో కలిసి నటించే వరకు తన ప్రస్థానం సాగిందని చెప్పాడు. ఒకప్పుడు చిరు పక్కన కూర్చుంటానని తాను తన స్నేహితులతో అన్నానని.. కానీ ఆయన సంకనెక్కి కూర్చునే స్థాయిలో క్లోజ్ అయ్యానని.. అది తన అదృష్టమని రవితేజ చమత్కరించగా.. చిరు సహా అందరూ గొల్లున నవ్వేశారు.
This post was last modified on January 9, 2023 9:28 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…