టాలీవుడ్ సంక్రాంతి రేస్ లో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య కృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. యూవీ కాన్సెప్ట్స్ బేనర్ పై సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. హీరో , హీరోయిన్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ రెండు బడా సినిమాల మధ్య ఈ చిన్న సినిమాకి సరైన ప్రమోషన్ దక్కడం లేదు. అందుకే స్వీటీ అనుష్క ఈ సినిమాకి సపోర్ట్ అందించబోతుంది.
‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు అనుష్క ద్వారా రిలీజ్ కాబోతుంది. థియేట్రికల్ ట్రైలర్ తో ఈ సినిమాపై కొంత బజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. యూవీ సంస్థతో అనుష్క కి మంచి రిలేషన్ ఉంది. ఈ బేనర్ లో ‘భాగమతి’ సినిమా చేసిన స్వీటీ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇక అనుష్క ప్రేక్షకులకు కనిపించి కూడా చాలా నెలలవుతుంది. ట్రైలర్ లాంచ్ వీడియో ద్వారా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది స్వీటీ.
సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ చిన్న సినిమా కోసం యూవీ సంస్థ తమ హీరోయిన్ ని ఇలా రంగంలో దింపుతుంది. మరి అనుష్క రిలీజ్ చేసే ఈ ట్రైలర్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందా ? చూడాలి.
This post was last modified on January 5, 2023 1:09 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…