Movie News

వీరయ్య నోట ఇడియట్ మాట

ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న కాంబోగా చిరంజీవి రవితేజల కలయిక వాల్తేరు వీరయ్య మీద ఏ రేంజ్ లో అంచనాలు పెంచుతోందో చూస్తున్నాం. పూనకాలు లిరికల్ వీడియోకి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్, పాటకు రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ కలిసి డాన్స్ చేయడాన్ని మాత్రం ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ పలు ఇంటర్వ్యూలలో దీని గురించి ప్రత్యేకంగా ఊరిస్తూ చెప్పడంతో ఎప్పుడెప్పుడు చూద్దామనే ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. పాటే ఇలా ఉంటే పరస్పరం తలపడే సన్నివేశాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి రేగడం సహజం.

హైప్ కి తగ్గట్టే ఓ కీలకమైన లీక్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇంటర్వెల్ బ్లాక్ కు ముందు చిరు రవితేజలు ఒకరినొకరు పోలీస్ స్టేషన్ లో తలపడే సీన్ ఉంటుంది. మాస్ రాజా ఏసిపిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనతో సవాల్ విసురుతూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ ‘సిటీకి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు వీరయ్య లోకల్ ఇక్కడే ఉంటాడు’ అని అంటాడట. ఇది ఇడియట్ లో ఎంత పెద్ద సూపర్ హిట్ సంభాషణో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. దానికి కౌంటర్ గా రవితేజ సైతం ఘరానా మొగుడులో ఏదీ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పడం మాములుగా ఉండదట.

వింటేనే అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్న ఇలాంటివి దర్శకుడు బాబీ బాగానే సెట్ చేసినట్టు వినికిడి. ఈ నెల 13న విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య పెద్ద సినిమాల లిస్టులో చివరిగా రావడం పట్ల మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికి ఊర మాస్ కంటెంట్ గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఆ టైంకంతా వారసుడు, తెగింపు, వీరసింహారెడ్డి ఫలితాలు వచ్చేసి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి స్క్రీన్ కౌంట్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలుంటాయి. ఈ నెల 8న వైజాగ్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధిందిన వేదికని ఇంకొద్ది గంటల్లో ఫైనల్ చేయబోతున్నారు.

This post was last modified on January 5, 2023 1:10 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago