ఇండియాలో జనాభా 130 కోట్ల దాకా ఉంది. అందులో యూట్యూబ్‌లో పాటల వీడియోలు చూసేవాళ్లు ఎంతమంది ఉంటారు? మొత్తం జనాభాలో సగం ఉన్నా గొప్పే. అలాంటిది ఒక ఇండియన్ సాంగ్‌కు యూట్యూబ్‌లో 90 కోట్ల వ్యూస్ వచ్చాయంటే అది ఏ స్థాయిలో జనాల హృదయాల్లోకి వెళ్లి ఉండాలి.. ఎన్ని చోట్ల ప్లే అవుతుండాలి..? ఆ పాట ఏ రేంజ్ హిట్టో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి.
ఇంతకీ ఆ పాట ఏదీ అంటారా? తమిళంలో ధనుష్, సాయిపల్లవిల మీద తెరకెక్కి రౌడీ బేబీ సాంగ్. ఏడాదిన్నర కిందట విడుదలైన మారి-2 చిత్రంలోనిదీ పాట. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
ప్రభుదేవా చాలా కాలం తర్వాత తమిళంలో కంపోజ్ చేసిన పాట ఇది. ధనుష్, సాయిపల్లవి ఇద్దరూ సూపర్ డ్యాన్సర్లు కావడం.. ప్రభుదేవా అదిరిపోయే రేంజిలో స్టెప్స్ కంపోజ్ చేయడం.. చాలా కలర్ ఫుల్‌గా మంచి థీమ్‌తో, హుషారెత్తించేలా ఈ పాటను చిత్రీకరించడంతో ఇన్‌స్టంట్‌గా జనాలకు నచ్చేసింది. సినిమా విడుదలకు ముందే సంచలనం రేపిన ఈ పాట.. ఆ తర్వాత మరింతగా జనాల్ని ఆకట్టుకుంది.
దేశవిదేశాల్లో ఈ పాటకు ఆదరణ దక్కింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరూ ఈ పాటను చూసి ఆనందించారు. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తూ వెళ్లింది. కోట్లల్లో వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఏకంగా 900 మిలియన్ మార్కును టచ్ చేసిందీ పాట. ఓ భారతీయ పాటకు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం అద్భుతమనే చెప్పాలి.
This post was last modified on July 20, 2020 11:20 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…