వీరమల్లు కి రిలీజ్ చిక్కు

పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవయిటింగ్ మూవీ ‘హరి హర వీర మల్లు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే బ్రేకులు బ్రేకులుగా కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేశారు. పవన్ డేట్స్ కరణంగా చాలా ఆలస్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం కావాల్సినన్నీ డేట్స్ ఇచ్చాడు పవన్. ఇకపై ఫోకస్ అంతా ఈ సినిమా మీదే పెట్టాడు. దీంతో మేకర్స్ ప్రకటించిన సమ్మర్ కే సినిమా రిలీజ్ అవ్వడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.

కానీ వీరమల్లు రిలీజ్ కి పెద్ద చిక్కే ఉంది. ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ అవ్వడం కష్టమే అనే మాటలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా నిర్మాత ఏఎం రత్నం కూడా ఓ ఇంటర్వ్యూలో సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నాం కానీ చెప్పలేం అన్నట్టుగా ఓ హింట్ అందించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ , ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించి రత్నం ఇలా అని ఉండొచ్చు.

కానీ ఏదేమైనా ‘హరి హర వీర మల్లు’ ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. సమ్మర్ కాకపోతే దసరా బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. పవన్ మొదటి సారిగా చేస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాపై పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఈ పాన్ ఇండియా మూవీతో పవన్ తన సత్తా చాటబోతున్నాడని వారు అభిప్రాయ పడుతున్నారు.