‘ఒక్కడు’కి దిమ్మ తిరిగే టార్గెట్

ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. నెలలో రెండు మూడు బడా సినిమాలు రీ రిలీజ్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే వీటిలో స్టార్ హీరోల సినిమాలకు థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఎవరూ ఊహించని విధంగా మొదటి రోజు మూడున్నర కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, పోకిరి , జల్సా రికార్డ్ ను అలవోకగా క్రాస్ చేసి న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది.

దీంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కి పవన్ ఫ్యాన్స్ ఓ టార్గెట్ ఫిక్స్ చేసినట్టైంది. ఖుషి కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా గట్టిగా చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాను చూసేందుకు సాధారణ ప్రేక్షకుడు కూడా ఆసక్తి కనబరిచాడు. ఇప్పుడు ఒక్కడు, ఖుషి డే వన్ రికార్డ్ ని కొట్టాలంటే మాత్రం మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి రావాల్సి ఉంది. ఇంతకు ముందు మహేష్ బర్త్ డే కి ‘ ఒక్కడు’ షోలు పడ్డాయి. కానీ లిమిటెడ్ షోస్ వేశారు. మహేష్ ఫ్యాన్స్ ఆ టైమ్ లో పోకిరి మీద ఫోకస్ పెట్టడంతో ఒక్కడు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

ఇప్పుడు జనవరి 7న ఒక్కడు మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఈసారి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వారం రోజుల పాటు అంటే సంక్రాంతి వరకు సినిమా ఆడనుంది. మరి ఈ ఒక్కడు నీ సైన్యమై అంటూ పవన్ దిమ్మ తిరిగే రికార్డ్ ను మహేష్ క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా? చూడాలి.