Movie News

తమ్ముడి జోడి ఎక్కడ వీరయ్యా

సంక్రాంతి బరిలో గట్టి పోటీ మధ్య దిగుతున్న వాల్తేరు వీరయ్య ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ఆడియోలో నాలుగు పాటల్లో రెండు ఛార్ట్ బస్టర్ కాగా మరో రెండు మెల్లగా ఎక్కేస్తున్నాయి. అందరూ భయపడినట్టు కాకుండా దేవిశ్రీప్రసాద్ డీసెంట్ ఆల్బమ్ తో అభిమానులను సంతోషపరిచాడు. చిన్న ప్రెస్ మీట్ అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్ రేంజ్ లో యూనిట్ సభ్యులంతా మాట్లాడ్డం ఇటీవలే జరిగింది. ముందస్తు విడుదల వేడుకని వైజాగ్ ఆర్కె బీచ్ వేదికగా ఈ నెల 8న గ్రాండ్ గా చేయబోతున్నారు. దానికి రెండు రోజుల ముందు 6న జగదాంబ థియేటర్ లో ట్రైలర్ లాంచ్ ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు.

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ రవితేజ పోషించిన ఏసిపి విక్రమ్ సాగర్ ఐపిఎస్ జోడిగా నటించిన క్యాథరిన్ త్రెస్సా జాడ ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలాని ప్రమోషన్లో భాగం చేసినప్పుడు మరి క్యాథరిన్ ని కూడా చూపించాలి కదా. కనీసం ఆ ప్రస్తావన కూడా ఎక్కడా చేయడం లేదు. ఆల్రెడీ వచ్చిన లీక్స్ ప్రకారం తను ఇందులో మాస్ మహారాజా భార్యగా నటించింది. ఓ పాప కూడా ఉంటుంది. డ్యూయెట్లు లాంటివి లేకపోయినా కథకు సంబంధించిన ఓ కీలక మలుపు ఈ జంటకు ఉంటుందని అన్నారు. అలాంటప్పుడు యాక్టివ్ గా బయటికి తీసుకురావాలి కదా.

మర్చిపోయారో లేక ఏదైనా ట్విస్టు ఇద్దామని ఆగారో తెలియదు. ఆ మధ్య ఇలాగే ఆచార్యలో ముందు కాజల్ అగర్వాల్ ని తీసుకుని కొంత షూట్ కూడా చేసి ఆ తర్వాత ఎడిటింగ్ లో క్యారెక్టర్ ని మాయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాథరిన్ కి అలా చేస్తారని కాదు కానీ మరీ దాచిపెట్టేంత రహస్యం ఏమీ లేనప్పుడు చెప్పేస్తే అయిపోతుందిగా. 2022లో బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ తో హ్యాపీగా ఉన్న క్యాథరిన్ కు ఇతర సినిమాల ఫలితాలు నిరాశ కలిగించాయి. ఒకవేళ వాల్తేరు వీరయ్యలో క్లిక్ అయితే ఇంకో బ్రేక్ రావొచ్చు. ఇంతకీ మీడియా ముందుకు ఎందుకు తీసుకురావడం లేదో వీరయ్యే చెప్పాలి. చూద్దాం.

This post was last modified on January 2, 2023 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

19 minutes ago

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…

22 minutes ago

బేబీని టెన్షన్ పెడుతున్న పుష్ప 2?

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…

1 hour ago

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…

1 hour ago

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

2 hours ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

2 hours ago