‘ధమాకా’కి ‘ఖుషి’ ట్రబుల్ 

Kushi
Kushi

గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ధమాకా థియేటర్స్ కి మాస్ జనాలను రప్పిస్తూ మంచి వసూళ్ళు అందుకుంటోంది. ఇప్పటికే 40 కోట్ల గ్రాస్ దాటేసిన ఈ సినిమా వీక్ డేస్ లో కొంత వసూళ్ళతో పరవాలేదనిపించుకుంటుంది. వచ్చే వీకెండ్ లో సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

అయితే ‘ధమాకా’ ఆశలపై ‘ఖుషి’ నీళ్ళు చల్లబోతుంది. పవన్ కళ్యాణ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ డిసెంబర్ 31న రీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే బుకింగ్స్ లో ‘ఖుషి’ జోరు చూపిస్తోంది. ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా టికెట్లు బాగానే సేల్ అవుతున్నాయి. ఎల్లుండి ఆల్మోస్ట్ అన్ని షోస్ హౌజ్ ఫుల్స్ పడటం ఖాయమనిపిస్తుంది.

ఇక ఈ వీకెండ్ పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేవు. అరడజను చిన్న సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఏ ఒక్క సినిమాకు బజ్ లేదు. సో వచ్చే వీకెండ్ కూడా ధమాకాకి మంచి వసూళ్ళు వస్తాయనుకుంటే ఖుషి బుకింగ్స్ ధమాకా కలెక్షన్స్ మీద గట్టి ప్రభావం చూపబోతున్నాయనిపిస్తుంది. అయితే ధమాకా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిపెడుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు. జస్ట్ హిట్ అనిపించుకుంటే చాలనుకున్నారు. కానీ సినిమా డే వన్ ఓపెనింగ్స్ చూసి షాక్ అయ్యారు. మాస్ కి సినిమా నచ్చడంతో సింగిల్ స్క్రీన్స్ లో సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. 

సక్సెస్ మీట్ తర్వాత ఇంకా వసూళ్ళు పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. కానీ ధమాకా వీకెండ్ కలెక్షన్స్ ఇప్పుడు ఖుషి వైపు మళ్ళబోతున్నాయి. ఏదేమైనా రీ రిలీజ్ సినిమాలతో ప్రెజెంట్ థియేటర్స్ లో ఆడుతున్న సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకయితే ఫ్యాన్స్ , మూవీ లవర్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు.